Abn logo
Oct 24 2020 @ 05:05AM

ధాన్యం కొనుగోలు కేంద్రాలపై దృష్టి

కందుకూరు: రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లపై దృషిపెట్టినట్టు పీఏసీఎస్‌ చైర్మన్‌ దేవరశెట్టి చంద్రశేఖర్‌ అన్నారు. శుక్రవారం వైస్‌చైర్మన్‌ గోపిరెడ్డి విజయేందర్‌రెడ్డితో కలిసి నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. దీర్ఘకాలిక అప్పు కింద 39 రైతులకు రూ.2.39కోట్ల మంజూరుకు జిల్లా కేంద్ర సహకార సంఘం కార్యాలయానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక అప్పులు అవసరం ఉన్న రైతులు తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సమావేశంలో డైరెక్టర్లు ఎస్‌.శేఖర్‌రెడ్డి, ఎన్‌ నర్సింహ, గౌరపర్వతాలు, జి.అంజమ్మ,  వెంకటేష్‌, సాధ పాండురంగారెడ్డి, తీగల జగదీశ్వర్‌రెడ్డి, సత్తినేని వెంకట్‌రాంరెడ్డి, పొట్టి ఆనంద్‌, చంద్రునాయక్‌, సిబ్బంది డి.రాములు, నిమ్మ యాదగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement