అభివృద్ధిపై దృష్టి సారించండి..

ABN , First Publish Date - 2022-01-22T05:17:06+05:30 IST

వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, విమర్శలు మానుకొని రాష్ట్రఅభివృద్ధిపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి పల్లె రఘు నాథ్‌రెడ్డి, మాజీ ఎంపీ నిమ్మల క్రిష్టప్ప పేర్కొన్నారు.

అభివృద్ధిపై దృష్టి సారించండి..

- గౌరవసభలో మాజీ మంత్రి పల్లె 

నల్లమాడ, జనవరి 21: వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు,  విమర్శలు మానుకొని రాష్ట్రఅభివృద్ధిపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి పల్లె రఘు నాథ్‌రెడ్డి, మాజీ ఎంపీ నిమ్మల క్రిష్టప్ప పేర్కొన్నారు. శుక్రవారం మసక వంట్లపల్లి పంచాయతీ కేంద్రంలో ఏర్పాటు చేసిన గౌరవసభకు వీరు ముఖ్యఅతిథులుగా హాజర య్యారు. ఈ సందర్భంగా పల్లె మాట్లాడుతూ పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి తనని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తి అని పదే పదే చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. శ్రీధర్‌రెడ్డి ఎక్కడ పుట్టాడో, ఎక్కడ విద్యాభ్యాసం చేశారో గుర్తు చేసుకోవాలన్నారు. నియోజ కవర్గంలోని ఏ గ్రామానికైనా తన వెంట శ్రీధర్‌రెడ్డి వస్తే చిన్నపిల్లలు కూ డా ఈ పల్లెరఘునాథ్‌రెడ్డిని గుర్తించి మాట్లాడు తారో శ్రీధర్‌రెడ్డికే తెలు స్తుందన్నారు. అధికార ముసుగులో మీరు ఏం చేస్తున్నారో ప్రజలు గమ నిస్తున్నారని వారే బుద్ధి చెప్పే రోజు లు దగ్గరకు వచ్చాయన్నారు. చవ కబారు విమర్శలు మానుకొని, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. అనంతరం గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధి పనులను ఆయన వివరించారు. ప్రస్తుత వైసీపీ ప్రభు త్వం గ్రామాలలో చిన్న రోడ్లు కూడా వేయలేని పరిస్థితిలో ఉందని మాజీ ఎంపి నిమ్మల క్రిష్టప్ప విమర్శించారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా రాష్ర్టానికి ఆదాయవనరులు సమకూరుస్తాయి గానీ, వైసీపీ ప్రభుత్వం మాత్రం రాష్ర్టాన్ని అప్పులపాలు చేసిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజ లు ఆనందంగా ఉండాలన్నా, అనుభవవైజ్ఞుడైన నారా చంద్రబా బునాయుడును మళ్లీ ముఖ్య మంత్రిగా తెచ్చుకోవాల్సిన బాధ్యత మనం దరి పైనా ఉందన్నారు.  ప్రభుత్వం సిమెంట్‌, ఇటుకలు, స్టీల్‌, ఇసుక, నిత్యా వసర వస్తువుల ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. ఈ కార్య క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సుబ్బరాయుడు, ఎల్‌ఐసి నరసిం హులు, రామచంద్ర, శ్రీనివాసులు, సిద్ధప్ప, విష్ణు, వెంకటరమణ నాయుడు, మైలే రామచంద్ర, భుట్టి నాగభూషణంనాయుడు, గంగులప్పనాయుడు, సర్పంచ్‌ ప్రభాకర్‌రెడ్డి, శివారెడ్డి, రాజారెడ్డి, పల్లపు జయచ ంద్రమోహన్‌, నిజాంవలీ, నాగరాజు, గంగప్ప, శంకర, ప్రకాష్‌, బాలిరెడ్డి, శీన పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T05:17:06+05:30 IST