ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

ABN , First Publish Date - 2022-01-31T19:08:03+05:30 IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారంనాడు 2021-22 ఆర్థిక సర్వేను..

ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారంనాడు 2021-22 ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసేదిగా భావించే ఈ సర్వే ఆధారంగానే ప్రతిఏటా బడ్జెట్ రూపకల్పన జరుగుతుంటుంది. కేంద్ర బడ్జెట్ మంగళవారంనాడు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దీనికి ముందుగా ''ఆర్థిక సర్వే''ను నిర్మలా సీతారామన్ లోక్‌సభకు సమర్పించారు. అనంతరం సభను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు సభాపతి ఓం బిర్లా ప్రకటించారు.


రాబోయే ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 8 నుంచి 8.8.5 శాతంగా ఉండొచ్చని ఆర్థిక శాఖ అంచనాల నేపథ్యంలో ఈ సర్వేను మంత్రి ప్రవేశపెట్టారు. సర్వే వివరాలను ఆర్థిక శాఖ ప్రత్యేక మీడియా సమావేశంలో వెల్లడించనుంది. కాగా, దీనికి ముందు, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడం ద్వారా ప్రారంభించారు. దేశ సాధించిన ప్రగతి, పథకాలు, భవిష్యత్‌ లక్ష్యాలను తన ప్రసంగంలో రాష్ట్రపతి వివరించారు.

Updated Date - 2022-01-31T19:08:03+05:30 IST