Advertisement
Advertisement
Abn logo
Advertisement

విశాఖ: పెందుర్తిలో ఫ్లై ఓవర్ కష్టాలు...

విశాఖ: నగరంలో కూడా అమరావతి రైతుల పరిస్థితి వెంటాడుతోంది. తమ భూములకు అధికారులు అతి తక్కువ ధర నిర్ణయించి నట్టేట ముంచారని పెందుర్తి వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుండా అధికారులు ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు చేపడితే ఆత్మహత్య తప్ప వేరే గత్యంతరం లేదని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


పెందుర్తి మండలంలోని 164 సర్వే నెంబర్‌కు చెందిన తమ భూములకు నేషనల్ హైవే అధారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తప్పులు చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రక్కనే ఉన్న తమ భూములను కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రకారం ధర నిర్ణయించాలని రైతులు డిమాండ్ చేశారు. 2018లో  నేషనల్ హైవే అధారిటీ ఆఫ్ ఇండియా  విడుదల చేసిన నోటిఫికేషన్ నాటికి సబ్ రిజిష్టార్ విలువ గజానికి రూ. 12,500 ఉండగా.. ఇప్పుడు గజం ధర రూ. 1,925కే ప్రకటించి అధికారులు చాలా పెద్ద తప్పు చేశారని విమర్శించారు. తమ భూముల విషయంలో న్యాయం చేయాలని లేదంటే గజం స్థలం కూడా తీసుకోలేరని రైతులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.

Advertisement
Advertisement