Abn logo
Sep 21 2020 @ 19:20PM

భారత్, కెనడాల మధ్య కుదిరిన ఎయిర్ బబుల్ ఒప్పందం!

Kaakateeya

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా భారత్‌లో చిక్కుకున్న కెనడా పౌరులకు, కెనడా వెళ్లాలనుకునే భారతీయులను భారత ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వివరాల్లోకి వెళితే.. భారత ప్రభుత్వం.. కెనడా ప్రభుత్వంతో ఎయిర్ ‌బబుల్ అగ్రిమెంట్ కుదుర్చుకుందని పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూర్తి ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్య విమాన సర్వీస్‌లు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు. భారత్‌లో చిక్కుకున్న కెనడా పౌరులలతో పాటు.. చెల్లుబాటయ్యే వీసా కలిగిన భారతీయులు కూడా కెనడాకు వెళ్లేందుకు మార్గం సుగమం అయిందన్నారు. అంతేకాకుండా కెనడాలో చిక్కుకున్న భారత పౌరులు, ఓసీఐ కార్డుదారులు, చెల్లుబాటు వీసా కలిగిన కెనడా పౌరులు భారత్‌కు రావొచ్చని వివరించారు. కాగా.. దాదాపు 13దేశాలతో ఎయిర్‌ బబుల్ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు భారత ప్రభుత్వం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. 


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement