Abn logo
Jun 3 2020 @ 03:47AM

జార్జ్‌ అంత్యక్రియలకు మేవెదర్‌ సాయం

న్యూయార్క్‌: వారం రోజుల కిందట అమెరికాలోని మిన్నెసోటా పోలీసుల చేతిలో ఊపిరాడక మరణించిన నల్ల జాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రముఖ బాక్సర్‌ ఫ్లాయిడ్‌ మేవెదర్‌ జూనియర్‌ ముందుకొచ్చాడు. దీని గురించి జార్జ్‌ కుటుంబంతో మేవెదర్‌ ఇప్పటికే మాట్లాడగా అందుకు వారు అంగీకరించారు. ఈనెల 9న జార్జ్‌ స్వస్థలం హ్యూస్టన్‌ నగరంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు అతడి కుటుంబానికి మేవెదర్‌ రూ.66.52 లక్షల చెక్‌ను పంపించాడు. ఈ విషయాన్ని ‘మేవెదర్‌ ప్రమోషన్స్‌’ సంస్థ సీఈఓ లియోనార్డ్‌ ఎల్లెర్బే ట్విటర్‌లో ధ్రువీకరించాడు. జార్జ్‌ మరణానికి నిరసనగా అమెరికా మొత్తం నిరసనలతో అట్టుడుకుతుండగా క్రీడాకారులు సైతం ఈ అమానవీయ ఉదంతాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రముఖ గోల్ఫర్‌ టైగర్‌ ఉడ్స్‌, ఫార్ములా వన్‌ రేసర్‌ హామిల్టన్‌ సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
Advertisement