నదిలో పూల వనం!

ABN , First Publish Date - 2020-11-27T05:14:57+05:30 IST

నదిలో నీళ్లన్నీ గులాబీ రంగులోకి మారాయని ఆశ్చర్యపోతున్నారా? నిజానికి నీళ్ల రంగు మారలేదు. ఆ నదిలో పూసిన పూల వల్ల ఆ దృశ్యం ఆవిష్కృతమయింది. ఆ సుందర దృశ్యాన్ని చూడటానికి పర్యాటకులు తరలివెళుతుంటారు

నదిలో పూల వనం!

నదిలో నీళ్లన్నీ గులాబీ రంగులోకి మారాయని ఆశ్చర్యపోతున్నారా? నిజానికి నీళ్ల రంగు మారలేదు. ఆ నదిలో పూసిన పూల వల్ల ఆ దృశ్యం ఆవిష్కృతమయింది. ఆ సుందర దృశ్యాన్ని చూడటానికి పర్యాటకులు తరలివెళుతుంటారు.


ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడుందో తెలుసా?

కేరళలో కోజికోడ్‌ జిల్లాలో అవల పండి అనే గ్రామం ఉంది. ఆ ఊరి పొలిమేరల గుండా చిన్న నది  పారుతూ వెళుతుంది. ఏటా ఈ సమయంలో ఆ నదిలో పూలు పూస్తాయి. ఆ పూల వర్ణంతో నది మొత్తం గులాబీ వర్ణంలోకి మారిపోతుంది.

ఫోర్క్‌డ్‌ ఫాన్‌వోర్ట్‌ అని పిలిచే పూలు ఈ ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయి. వాటివల్ల నది గులాబీ వర్ణంలోకి మారుతుంది. స్థానికంగా వీటిని ముల్లన్‌ పాయల్‌ అని పిలుస్తారు.

స్థానికులు ఈ పూలను కోసి అమ్ముకుని ఆదాయం గడిస్తుంటారు. ప్రస్తుతం ఈ నది ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

Updated Date - 2020-11-27T05:14:57+05:30 IST