కన్నుల పండువగా పూల జాతర

ABN , First Publish Date - 2022-10-04T06:07:17+05:30 IST

ఒక్కేసి.. పువ్వేసి.. చందమామ.. ఒక్క జా ములాయే చందమామ.. రామ రామరామ ఉయ్యాలో... రామనే శ్రీరామ ఉ య్యాలో అంటూ మహిళల పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అం బరాన్నంటాయి.

కన్నుల పండువగా పూల జాతర
బతుకమ్మ ఆడుతున్న మహిళలు

అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు

జగిత్యాల టౌన్‌, అక్టోబరు 3 : ఒక్కేసి.. పువ్వేసి.. చందమామ.. ఒక్క జా ములాయే చందమామ.. రామ రామరామ ఉయ్యాలో... రామనే శ్రీరామ ఉ య్యాలో అంటూ మహిళల పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అం బరాన్నంటాయి. మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ ఉ త్సవాలను ఘనంగా జరుపుకున్నారు. జగిత్యాల టవర్‌ సర్కిల్‌తో పాటు మి నీ స్టేడియంలో మహిళలు పెద్ద ఎత్తున చేరి, రాత్రి వరకు బతుకమ్మల వ ద్ద ఆడి, పాడిన మహిళలు, రాత్రి వాటిని నిమజ్జనం చేశారు. ముందస్తుగా బల్దియా ఆధ్వర్యంలో వీధి దీపాలను అలంకరించారు. ఎస్పీ సింధు శర్మ ఆ ధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ బందోబస్తును ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, జగిత్యాల బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణితో పాటు జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత, అన్ని వార్డుల కౌన్సిలర్లు, ప్రజాప్రథినిదులు వేడుకల్లో పాల్గొన్నారు. 

కోరుట్ల : కోరుట్లలో సద్దుల బతుకమ్మ నిమజ్జనోత్సవాన్ని సోమవారం ప ట్టణ ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. పట్టణంలోని ఆయా వా ర్డులకు చెందిన మహిళలు, యువతులు తెలంగాణ సాంస్కృతి ఉట్టి పడే విధంగా బతుకమ్మలతో శోభాయాత్ర జరిపారు. అనంతరం స్థానిక చెరువు, వాగుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కోరుట్ల సీఐ రాజశేఖర్‌ రాజు ఆధ్వర్యంలో సర్కిల్‌ పరిధిలోని ఎస్‌ఐ సతీష్‌, శ్యామ్‌రాజులు ప్రత్యేక బందోబస్తును నిర్వహించారు. వాగు వద్ద మున్సిపల్‌ అధికారులు మహిళలకు ఎలాంటి ఇబ్బం దులు కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లను జరిపారు. 

ధర్మపురి: ధర్మపురి క్షేత్రంలో బతుకమ్మ నిమజ్జనం వేడుకలు సోమ వా రం అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయంత్రం బతుకమ్మలతో ఊరే గింపుగా గోదావరి వద్దకు చేరుకుని ఆడారు. రాత్రి బతుకమ్మలను గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. ధర్మపురి సీఐ కోటేశ్వర్‌, ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ ఆ ధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్యమ్మ, జడ్పీటీసీ అరుణ, మున్సిపల్‌ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఫధర్మపురి గోదావరి నది వద్ద 1981 ఎస్‌ఎస్‌సీ పూర్వపు విద్యార్థుల మి త్ర బృందం ఆధ్వర్యంలో మున్సిపల్‌ 11వ వార్డు కౌన్సిలర్‌ జక్కు పద్మ- రవీందర్‌ సహకారంతో ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు అందించారు. 


Updated Date - 2022-10-04T06:07:17+05:30 IST