Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఫ్లవారా? వెటోరీనా?.. లక్నో హెడ్ కోచ్ రేసులో దిగ్గజాలు

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఐపీఎల్ మరింత రసవత్తరంగా, సుదీర్ఘంగా సాగబోతోంది. లక్నో, అహ్మదాబాద్ పేరుతో రెండు కొత్త జట్లు ఐపీఎల్‌లో అడుగుపెట్టడమే అందుకు కారణం. త్వరలోనే ఆటగాళ్ల కోసం మెగా వేలం జరగనుంది. అయితే, అంతకుముందే కొత్త ఫ్రాంచైజీలు జట్ల కూర్పుకోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇందులో భాగంగా ఏ ఆటగాడిని తీసుకోవాలి? కోచ్‌గా ఎవరుంటే బాగుంటుంది? అన్న అంశాలపై దృష్టి సారించాయి. 


ఈ విషయంలో లక్నో ఓ అడుగు ముందే ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ఫ్రాంచైజీ ఇప్పటికే కెప్టెన్, హెడ్‌కోచ్‌లను ఎంచుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాన కోచ్‌ కోసం ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలించి ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేసిందని, వారిద్దరిలో ఒకరు జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ ఆండీ ఫ్లవర్ కాగా, రెండో వ్యక్తి న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డేనియల్ వెటోరీ అని తెలుస్తోంది.


 గ్యారీ కిరెస్టన్, ట్రెవర్ బేలిస్‌లను కూడా పరిగణనలోకి తీసుకున్నప్పటికీ వారు రేసులో నిలబడలేకపోయారని చెబుతున్నారు. అంతేకాదు, వెటోరీ కంటే ఫ్లవర్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు కూడా చెబుతున్నారు. లక్నో కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ పేరు ఇప్పటికే వినిపిస్తోంది. అతడితో ఫ్లవర్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి.


అంతేకాదు, వారిద్దరూ ఒకరికొకరు రికమెండ్ చేసుకున్నట్టు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ లక్నోకు పనిచేయడం పక్కా అని చెబుతున్నారు. అయితే, అధికారిక ప్రకటన వెలువడడానికి మాత్రం ఇంకా చాలా రోజులే పట్టే అవకాశం ఉంది.

Advertisement
Advertisement