Ex husband for Sale: ఇంటితో పాటు మాజీ భర్తను అమ్మకానికి పెట్టిన మహిళ.. రూ.5.30 కోట్లిస్తే..

ABN , First Publish Date - 2022-04-30T19:41:20+05:30 IST

పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి మారుతున్నప్పుడు ఫర్నిచర్‌తో పాటు ఇతర పాత వస్తువులను కూడా చాలా మంది అమ్మేస్తుంటారు.

Ex husband for Sale: ఇంటితో పాటు మాజీ భర్తను అమ్మకానికి పెట్టిన మహిళ.. రూ.5.30 కోట్లిస్తే..

పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి మారుతున్నప్పుడు ఫర్నిచర్‌తో పాటు ఇతర పాత వస్తువులను కూడా చాలా మంది అమ్మేస్తుంటారు. ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళ తన పాత ఇంటితో పాటు భర్తను కూడా అమ్మకానికి పెట్టింది. పనామా సిటీ బీచ్ ఏరియాలో ఉన్న తన ఇంటిని క్రిస్టల్ బాల్ అనే మహిళ రూ.5.30 కోట్లకు అమ్మకానికి పెట్టింది. ఆ ఇంటిలో స్విమ్మింగ్ పూల్, హాట్ టబ్, త్రీ బెడ్రూమ్స్, ఇతర సౌకర్యాలతో పాటు తన మాజీ భర్త రిచర్డ్‌ కూడా ఉంటాడని క్రిస్టల్ తన ప్రకనటలో పేర్కొనడం గమనార్హం. 


రిచర్డ్, క్రిస్టల్ గత ఏడేళ్లుగా అదే ఇంట్లో కలిసి నివసిస్తున్నారు. తాజాగా ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. పిల్లల సంరక్షణ బాధ్యతను, బిజినెస్‌ను సమంగా పంచుకున్నారు. ఈ నేపథ్యంలో క్రిస్టల్ ఆ ఇంటిని అమ్మకానికి పెట్టింది. ఇంట్లో ఉన్న తన మాజీ భర్త ఫొటోలను కూడా క్రిస్టల్ ఆన్‌లైన్ సైట్‌లో పెట్టింది. అంతే కాదు తన మాజీ భర్తకు సంబంధించిన విశేషాలను కూడా పంచుకుంది. అతను అద్భుతంగా వంట చేస్తాడని, అతని పెద్ద చెవులు ఎలాంటి శబ్దాన్నైనా సులభంగా పసిగడతాయని, అతని ఇటాలియన్ ముక్కు వాసనను బాగా గుర్తించగలదని, అతను హాట్ టబ్‌ను చాలా సులభంగా ఎత్తేస్తాడని క్రిస్టల్ పేర్కొంది. 


Updated Date - 2022-04-30T19:41:20+05:30 IST