భౌతిక దూరం పాటించమని చెప్పినందుకు.. అమెరికాలో..

ABN , First Publish Date - 2020-04-08T23:22:53+05:30 IST

కొవిడ్-19ను నియంత్రించేందుకు భౌతిక దూరం పాటించమని చెప్పినందుకు తండ్రి, కూతురుపై దాదాపు 20 మంది దాడికి పాల్పడ్డారు. ఫ్లోరిడాలోని ఫ్లోరిడా కీస్ బీచ్‌లో గత శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది.

భౌతిక దూరం పాటించమని చెప్పినందుకు.. అమెరికాలో..

ఫ్లోరిడా: కొవిడ్-19ను నియంత్రించేందుకు భౌతిక దూరం పాటించమని చెప్పినందుకు తండ్రి, కూతురుపై దాదాపు 20 మంది దాడికి పాల్పడ్డారు. ఫ్లోరిడాలోని ఫ్లోరిడా కీస్ బీచ్‌లో గత శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. భాదితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తాము విస్టీరియా ఐల్యాండ్‌లో నివసిస్తామని.. తమ ఇంటి దగ్గర ఉన్న బీచ్‌లో దాదాపు 20 మంది యువకులు మందు కొడుతున్నట్టు తాను, తన తండ్రి చూశామని చెప్పింది. వెంటనే వారి దగ్గరకు వెళ్లి భౌతిక దూరం పాటించమని, శబ్దం చేయవద్దంటూ తన తండ్రి సూచించాడని పేర్కొంది. దీంతో కోపగించిన యువకులు తమపైకి దాడి చేసేందుకు వచ్చారని తెలిపింది. బేస్‌బాల్ బ్యాట్‌తో ఇద్దరిని తలపై కొట్టినట్టు వివరించింది. తాను ఘటనా స్థలానికి వెళ్తుండగా.. యువకులు తనను చూసి బోటులో పారిపోయినట్టు ప్రత్యక్ష సాక్షి చెబుతున్నాడు. కాగా.. మహిళ, ఆమె తండ్రి ప్రస్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2020-04-08T23:22:53+05:30 IST