ఫ్లోరిడాలో ఒకేరోజు ఆరు వేలకు పైగా కేసులు

ABN , First Publish Date - 2020-08-10T07:19:17+05:30 IST

ఫ్లోరిడాను కరోనా మహమ్మారి కుదిపేస్తూనే ఉంది. గత 13 రోజులుగా నిత్యం 6 వేలకు

ఫ్లోరిడాలో ఒకేరోజు ఆరు వేలకు పైగా కేసులు

ఆర్లాండో: ఫ్లోరిడాను కరోనా మహమ్మారి కుదిపేస్తూనే ఉంది. గత 13 రోజులుగా నిత్యం 6 వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఫ్లోరిడా వ్యాప్తంగా 6,190 కరోనా కేసులు నమోదైనట్టు ఫ్లోరిడా హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆదివారం వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 5,32,806కు చేరుకుంది. మరోపక్క ఫ్లోరిడాలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 8,186గా ఉంది. ఫ్లోరిడాలోని ఆసుపత్రులు మొత్తం కరోనా పేషంట్లతోనే నిండిపోయాయి. ఇప్పటికే అనేక ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్స్ మొత్తం నిండిపోయాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే న్యూయార్క్‌లో ఏప్రిల్, మే నెలల్లో ఏర్పడినే పరిస్థితులే ఫ్లోరిడాలోనూ ఏర్పడతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యూయార్క్‌లో ఏప్రిల్, మే నెలల్లో పేషంట్లు ఆసుపత్రికి వచ్చిన సెకన్లలోనే ప్రాణాలు కోల్పోయారు. బెడ్స్ ఖాళీ లేక చాలా మంది ఆసుపత్రి కారిడార్‌లోనే చికిత్స పొందుతూ మరణించారు. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి అదుపులోకి రాగా.. అనేక రాష్ట్రాలు కరోనాకు కేంద్రాలుగా మారిపోయాయి.

Updated Date - 2020-08-10T07:19:17+05:30 IST