ఫ్లోరిడాను వణికిస్తున్న కరోనా మహమ్మారి.. గడిచిన 24 గంటల్లో..

ABN , First Publish Date - 2020-07-19T03:41:24+05:30 IST

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం కరోనాకు కేంద్రంగా మారింది. ఫ్లోరిడాలో నిత్యం పదివేలకు

ఫ్లోరిడాను వణికిస్తున్న కరోనా మహమ్మారి.. గడిచిన 24 గంటల్లో..

ఆర్లాండో: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం కరోనాకు కేంద్రంగా మారింది. ఫ్లోరిడాలో నిత్యం పదివేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం ఫ్లోరిడా వ్యాప్తంగా 10,328 కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,37,569కి చేరింది. మరోపక్క ఫ్లోరిడాలో గడిచిన 24 గంటల్లో 90 మంది కరోనా కారణంగా మృత్యువాతపడ్డారు. కొత్తగా నమోదైన మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 4,895కు చేరుకుంది. ఫ్లోరిడాలో కేసుల వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో రెస్టారెంట్లు, బార్లు, పబ్‌లు, ఫంక్షన్ హాళ్లపై ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు విధించింది. ఇదిలా ఉంటే.. ఫ్లోరిడాలో ఇటీవల 15 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అమెరికా వ్యాప్తంగా ఒక రాష్ట్రంలో ఇన్ని కరోనా కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. ఫ్లోరిడాలో మాస్క్‌లు ధరించకుండా తిరుతున్నందుకే కేసులు ఈ విధంగా పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అమెరికాలో ఇప్పటివరకు 37 లక్షలకు పైగా కేసులు నమోదవగా.. లక్షా 40 వేలకు పైగా మరణించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి.

Updated Date - 2020-07-19T03:41:24+05:30 IST