ఫ్లోరిడాలో దాదాపు మూడు వారాల తర్వాత..

ABN , First Publish Date - 2020-08-03T09:16:31+05:30 IST

ఫ్లోరిడాలో దాదాపు మూడు వారాల తర్వాత కరోనా కేసుల్లో తగ్గముఖం కనిపించింది

ఫ్లోరిడాలో దాదాపు మూడు వారాల తర్వాత..

ఆర్లాండో: ఫ్లోరిడాలో దాదాపు మూడు వారాల తర్వాత కరోనా కేసుల్లో తగ్గముఖం కనిపించింది. గడిచిన 24 గంటల్లో ఫ్లోరిడాలో 7,104 కరోనా కేసులు నమోదయ్యాయి. గత కొద్ది రోజుల నుంచి ఫ్లోరిడాలో నిత్యం 9 వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతూ వచ్చాయి. శుక్రవారం కూడా ఫ్లోరిడాలో 9,619 కేసులు నమోదయ్యాయి. కేసుల్లో తగ్గుముఖం కనిపించడంతో అధికారులు కొంచెం ఉపశమనం పొందారు. ప్రస్తుత సమయంలో ఇది కొంచెం ఆనందించదగ్గ విషయమని.. అయితే ఇక నుంచి కరోనా కేసుల సంఖ్య తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా నమోదైన కేసులతో ఫ్లోరిడాలో మొత్తం కేసుల సంఖ్య 4,87,132కు చేరుకుంది. మరోపక్క మరణాల సంఖ్యలో కూడా తగ్గుముఖం కనపడుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 62 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 7,084గా ఉంది. అమెరికాలోని అనేక రాష్ట్రాలు ప్రస్తుతం కరోనాకు కేంద్రాలుగా మారిపోయాయి. అందులో ఫ్లోరిడా రాష్ట్రం కూడా ఒకటి. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 48,05,628 కరోనా కేసులు నమోదు కాగా.. 1,58,248 మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2020-08-03T09:16:31+05:30 IST