Abn logo
Feb 25 2021 @ 13:06PM

భార్య ప్రియుడి పురుషాంగాన్ని కత్తిరించిన భర్త.. ఫ్లోరిడాలో..

ఫ్లోరిడా: భార్య ప్రియుడి పురుషాంగాన్ని కత్తిరించి జైలు జీవితాన్ని గడుపుతూ వస్తున్న వ్యక్తి ఆ పనిని తెలివితక్కువ తనంతో చేశానంటూ గురువారం కోర్టుకు చెప్పుకొచ్చాడు. వివరాల్లోకి వెళ్తే.. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం తెలిసి భర్త అలెక్స్ బొనిల్లా(51) దారుణానికి పాల్పడ్డాడు. భార్య ప్రియుడి ఇంటికి వెళ్లి అతడి పురుషాంగాన్ని కత్తిరించేశాడు. ఫ్లోరిడాలో 2019 జూలైలో ఈ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. 


కోర్టు తెలిపిన వివరాల ప్రకారం.. అలెక్స్ తన భార్య ప్రియుడి ఇంటికి వెళ్లి తుపాకీతో అతడిని బెదిరించాడు. అతడిని తాళ్లతో కట్టేసి ‘నువ్వు ఈ రోజు చావడం లేదు. కానీ ఈ రోజును నువ్వు జీవితాంతం గుర్తుంచుకుంటావు’ అంటూ చెప్పుకొచ్చాడు. అనంతరం ఓ కత్తెర తీసుకుని అతడి పురుషాంగాన్ని కత్తిరించేశాడు. బాధితుడి ఇద్దరు కూతుళ్ల కళ్లెదుటే అలెక్స్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. 


ఈ ఘటన తర్వాత అలెక్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని జైల్లో పెట్టారు. దాదాపు రెండేళ్ల నుంచి ఈ కేసు కోర్టులో నడుస్తోంది. అలెక్స్‌ను గురువారం మరోసారి జడ్జి ముందు ప్రవేశపెట్టగా.. తెలివితక్కువగా, స్పృహలో లేకుండా ఈ దారుణానికి పాల్పడ్డానంటూ అలెక్స్ జడ్జితో చెప్పాడు. అలెక్స్‌ను కోర్టు దోషిగా తేల్చితే అతడికి 30 ఏళ్ల జైలుశిక్ష విధించే అవకాశముంది.

Advertisement
Advertisement
Advertisement