పోలీసుల పనితీరుపై నెటిజన్ల ప్రశంసలు.. రియల్ హీరోలు అంటూ కామెంట్స్.. ఇంతకూ విషయం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-04-07T01:41:55+05:30 IST

పోలీసులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు.. అధికారులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రియల్ హీరోలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అభినం

పోలీసుల పనితీరుపై నెటిజన్ల ప్రశంసలు.. రియల్ హీరోలు అంటూ కామెంట్స్.. ఇంతకూ విషయం ఏంటంటే..

కాలిఫోర్నియా: పోలీసులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు.. అధికారులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రియల్ హీరోలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అభినందించేంత గొప్ప పని వాళ్లు ఏం చేశారు? అని ఆలోచిస్తున్నారా? అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే. 



ఏం జరిగిందో ఏమో కానీ ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో కారు నడుపుతున్న వ్యాక్తి కారులోనే చిక్కుకుపోయాడు. ఈ క్రమంలో అతడు భయంతో కేకలు వేశాడు. అది విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతేకాకుండా మంటల్లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడారు. ఈ ఘటన ఫ్లోరిడాలోని Charlotte Countyలో చోటు చేసుకోగా.. అందుకు సంబంధించిన వీడియోను స్థానిక షరీఫ్ ఆఫీస్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. కారు బెల్ట్ మెడకు చుట్టుకుపోవడం వల్లే అతడు అందులోంచి బయటపడలేకపోయినట్టు తెలిపింది. రెట్ పారిష్, బ్రయంట్ వాస్క్వెజ్ అనే అధికారులు.. వేగంగా స్పందించి కారులో ఇరుక్కున్న వ్యక్తిని కాపాడినట్టు పేర్కొంది. కాగా.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇద్దరు అధికారులను ప్రశంసిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 






Updated Date - 2022-04-07T01:41:55+05:30 IST