Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఫ్లోరిడాలో మళ్లీ కరోనా విజృంభణ..!

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. తాజాగా కరోనా కొత్త కేసుల సంఖ్య 50 శాతం పెరిగినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. గడిచిన వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,10,000 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అంతకుముందు వారం ఈ సంఖ్య 72వేలుగా ఉంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్య ఈ ఏడాది ప్రారంభంలో మహమ్మారి ఉధృతి కొనసాగుతున్న సమయంలో నమోదైన కేసులకు సమానంగా ఉంటున్నాయని ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. అటు ఆస్పత్రిలో చేరుతున్న కరోనా రోగుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నట్లు ఫ్లోరిడా హాస్పిటల్ అసోసియేషన్ తెలిపింది. 


శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 9,300 మంది కరోనాతో ఆస్పత్రిలో చేరినట్లు పేర్కొంది. గతేడాది జూలై 23న ఒకే రోజు రికార్డు స్థాయిలో 10,179 మంది ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ సంఖ్యలో కరోనా రోగులు పెరుగుతున్నట్లు చెప్పింది. కాగా, ఇప్పటివరకు ఫ్లోరిడాలో 60 శాతం మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. అయినా కరోనా కేసులు పెరుగుతుండడం పట్ల ఆ రాష్ట్ర గవర్నర్ రాన్ డీసాంటీస్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. పాఠశాలల్లో కూడా పిల్లలకు మాస్కు తప్పనిసరిగా ధరింపజేయాలని కోరారు. అలాగే సామాజిక దూరం పాటించడం కూడా తస్పనిసరి అని పేర్కొన్నారు.  

 

ఇదిలాఉంటే.. అమెరికా వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా మళ్లీ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజులో 92 వేలకు పైగా కేసులు నమోదు కాగా, శుక్రవారం 99వేల వరకు కొత్త కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఇన్ని ఎక్కువ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అంతకుముందు రోజు 84 వేల మందికి పైగా వైరస్‌ బారిన పడ్డారు. ఇలా గడిచిన మూడు నాలుగు రోజులుగా కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. 

Advertisement

అమెరికా నగరాల్లోమరిన్ని...

Advertisement