హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రధాన రోడ్లపై వరద పొటెత్తింది. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. వర్షానికి వాహనదారుల ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నీరు నిలిచిపోకుండా స్థానికులు మ్యాన్‌హోల్స్ మూతలు తీశారు. వాహనదారులు అప్రమత్తంగా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుఫాన్ దృష్ట్యా హైదరాబాద్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయం కోసం కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 040-23202813కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గత రెండు గంటలుగా హైదరాబాద్‌లో కుండపోత వర్షం పడుతోంది. హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ హైఅలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కారు మబ్బులు కమ్ముకున్నాయి. మరో నాలుగైదు గంటలపాటు హైదరాబాద్‌లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.