శ్రీశైలానికి పోటెత్తిన వరద

ABN , First Publish Date - 2021-09-17T08:44:06+05:30 IST

శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద పోటెత్తుతోంది. గరువారం సాయంత్రం 6 గంటల సమయానికి డ్యామ్‌ వద్ద 2,42,373 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది.

శ్రీశైలానికి పోటెత్తిన వరద

5క్రస్టు గేట్ల ద్వారా నీటి విడుదల

శ్రీశైలం, సెప్టెంబరు 16:  శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద పోటెత్తుతోంది. గరువారం సాయంత్రం 6 గంటల సమయానికి డ్యామ్‌ వద్ద 2,42,373 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. డ్యామ్‌ 5 క్రస్టుగేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,39,915 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. గురువారం జూరాల నుంచి 1,95,326 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 47,047 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి చేరుతోంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.80 అడుగులుగా నమోదయింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 214.3637 టీఎంసీలుగా నమోదైంది. విద్యుదుత్పత్తి ద్వారా ఏపీ 27,064 క్యూసెక్కులు, తెలంగాణ 31,784 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నాయి.

Updated Date - 2021-09-17T08:44:06+05:30 IST