కృష్ణమ్మకు పోటెత్తుతున్న వరద నీరు

ABN , First Publish Date - 2020-07-12T09:45:03+05:30 IST

ప్రకాశం బ్యారేజీ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ ఉరకలేస్తోంది. ఖమ్మం జిల్లాలో

కృష్ణమ్మకు పోటెత్తుతున్న వరద నీరు

విజయవాడ, జూలై 11 (ఆంధ్రజ్యోతి) : ప్రకాశం బ్యారేజీ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ ఉరకలేస్తోంది.  ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వెలగలేరు వాగు నుంచి వరద నీరు కృష్ణానదిలోకి వస్తోంది. ఎగువ నుంచి మొత్తం 16వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోందని జలవనరుల శాఖ అధికారులు లెక్కించారు. ఒకపక్క పట్టిసీమ, మరోపక్క వెలగలేరు నుంచి నీరు వస్తే బ్యారేజీ నీటిమట్టం గరిష్ట స్థాయిని దాటిపోతుంది.


దీంతో పట్టిసీమ నుంచి గోదావరి జలాల తరలింపును నిలుపుదల చేశారు. బ్యారేజీ ఐదు గేట్లను ఒక అడుగు మేరకు ఎత్తారు. 3,625 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం నాటికి వరద ఉధృతి పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. 3,625 క్యూసెక్కులు దిగువకు వదులుతుండగా, మరో 8,285 క్యూసెక్కులు కాల్వలకు విడుదల చేస్తున్నారు. కేఈబీ కెనాల్‌కు 906, బందరు కాల్వకు 1,057, ఏలూరు కాల్వకు 1,204, రైవస్‌ కాల్వకు 2,109, కేడబ్ల్యూ కాల్వకు 3,007 క్యూసెక్కులు.. వెరసి 8,283 క్యూసెక్కుల నీటిని ఇస్తున్నారు.

Updated Date - 2020-07-12T09:45:03+05:30 IST