వరద భయం..

ABN , First Publish Date - 2022-09-13T05:18:08+05:30 IST

గోదావరి వరదలు విలీన మండలాల ప్రజ ల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. జూలైలో ఒకసారి, ఆగస్టులో రెండుసార్లు గోదావరి వరదలు విలీన వేలేరుపా డు, కుక్కునూరు, పోలవరం మండలాలను అతలాకుతలం చేయగా వరద తాకిడికి గ్రామాలకు గ్రామాలే తుడుచుకు పెట్టుకుపోయాయి.

వరద భయం..
రుద్రమకోట కాజ్‌వేపై ద్విచక్రవాహనం మోసుకెళ్తున్న యువకులు

పెరుగుతున్న గోదావరి

భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

విలీన గ్రామాలకు వరద తాకిడి

స్తంభించిన రాకపోకలు

గ్రామం ఖాళీ చేసి సురక్షిత 

ప్రాంతాలకు రేపాకగొమ్ము ప్రజలు


వేలేరుపాడు/ కుక్కునూరు/ పోలవరం/గణపవరం సెప్టెంబరు 12 : గోదావరి వరదలు విలీన మండలాల ప్రజ ల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. జూలైలో ఒకసారి, ఆగస్టులో రెండుసార్లు గోదావరి వరదలు విలీన వేలేరుపా డు, కుక్కునూరు, పోలవరం మండలాలను అతలాకుతలం చేయగా వరద తాకిడికి గ్రామాలకు గ్రామాలే తుడుచుకు పెట్టుకుపోయాయి. ఇప్పుడు మళ్లీ గోదావరికి వరద పోటెత్తు తోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం 45 అడుగులకు చేరుకో వడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దిగువ ప్రాంతాలైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని గ్రామాలను గోదావరి వరద చుట్టుముడుతోంది. సోమ వారం ఉదయానికే వేలేరుపాడు, రుద్రమకోట, వేలేరుపాడు– కొయిదా ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరడంతో రాకపో కలు స్తంభించాయి. ఈ వైపుగా ఆదివారం మధ్యాహ్నం నుంచే రహదారులు బంద్‌ అయ్యాయి. గోదావరి నది ఎగువ ప్రాంతాల్లో నాలుగు రోజుల నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద నీరు పోటెత్తుతోంది. గత వరదల సమయంలో గంటకు అంగుళం నుంచి రెండు అంగులాలు పెరిగి భీభత్సం సృష్టించగా  ప్రస్తుతం గంటకు అడుగుపైనే నీటిమట్టం పెరుగుతోంది. గోదావరి వరద తీవ్రతకు బెంబేలెత్తిన గోదావరి తీర గ్రామా ల ప్రజలు ఆదివారం రాత్రి నుంచే తమ ఊళ్లను ఖాళీ చేశారు. గత వరదల్లో పూర్తిగా తుడుచు పెట్టుకుపోయిన రేపాకగొమ్ము గ్రామ ప్రజలు వరదల అనంతరం వారం క్రితమే మిగిలిన ఇళ్లను శుభ్రం చేసుకుని గ్రామానికి చేరుకు న్నారు. అంతలోనే మళ్లీ వరద పెరగడంతో గ్రామం మొత్తా న్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. గోదావరి ఎగువ భాగాన వరద తీవ్రత ఎక్కువగానే ఉందని తెలంగా ణ అధికారులు ప్రకటించారు. అయితే ఎంత మేర వరద వస్తుందో చెప్పలేని పరిస్థితిలో అధికారులు ఉండటంతో ప్రజలు ముందుగానే రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. గోదా వరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వేలే రుపాడు ఎస్‌ఐ ఆర్‌.శ్రీను సూచించారు. ప్రజలు వరద నీటిలోకి వెళ్లకుండా సిబ్బందిని నియమించామన్నారు.


రైతాంగం ఆందోళన

గోదావరి పెరుగుతుండటంతో రైతాంగంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. రెండు నెలల క్రితం గోదావరి వచ్చిన సమయంలో పత్తి పంట నష్టపోయారు. మరలా ఇప్పుడు మిర్చి సాగు చేస్తున్న సమయంలో వరద ముంచెత్తడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. గోదావరి వచ్చిన ప్రతిసారి వేలాది రూపాయల నష్టం చవి చూడాల్సి వస్తున్నది. కుక్కునూ మండలంలో దాదాపు 500 ఎకరాల్లో మిర్చి పంట మునిగినట్టు రైతులు చెబుతున్నారు.


 ప్రాజెక్టు వద్ద పెరుగుతున్న నీటిమట్టం 

కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద జలాలతో, శబరి, ఇంద్రావతి, సీలేరు లాంటి ఉపనదుల జలాలతో, కొండ వాగుల జలాలతో గోదావరి నీటిమట్టం క్రమ క్రమంగా పెరుగుతోంది. సోమవారం నాటికి గోదావరి నీటిమట్టం అనూహ్యంగా పెరిగింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే, ఎగువ కాఫర్‌ డ్యాంలకు ఎగువున 32.100 మీటర్ల నీటిమట్టం, స్పిల్‌ వే దిగువన, దిగువ కాఫర్‌డ్యాం దిగువన 23.080 మీటర్ల నీటిమట్టం, పోలవరంలో 22.170 మీటర్లు నమోదైంది. అదనంగా వస్తున్న 6,61,795 క్యూసెక్కుల వరద జలాలను దిగువకు విడుదల చేసినట్లు ఈఈ ఆదిరెడ్డి తెలిపారు.


కొవ్వాడ రిజర్వాయర్‌ నుంచి నీరు విడుదల

భారీ వర్షాలకు కొండవాగులు పొంగి ప్రవహించడంతో సోమవారం పోలవరం మండలం ఎన్‌ఎన్‌డీ సమీపంలో ఉన్న కొవ్వాడ జలాశయం నుంచి 120 క్యూసెక్కుల జలాలు దిగువకు విడుదల చేశారు. కొవ్వాడ కాలువ జలాశయానికి పాయింట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 90.5 మీటర్లు కాగా ప్రస్తుతం 89.25 మీటర్ల నీటిమట్టం నమోదైనట్టు ఏఈ కొండలరావు తెలిపారు.  


వంతెనను తాకిన యనమదుర్రు వరద

యనమదుర్రు డ్రెయిన్‌ ఉధృతంగా ప్రవహిస్తున్నది. గణపవరం మండలం డ్రెయిన్‌ పరివాహక గ్రామాల్లోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీరు ఎస్‌.కొందే పాడు వద్ద లోలెవిల్‌ వంతె నను తాకుతోంది.దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.  రెండు రోజుల నుంచి ఎస్‌.కొందేపాడు ప్రాంత ప్రజలు ఇటు భీమ వరం అటు తాడేపల్లిగూడెం ప్రజలు ఈ వంతెనపై నుంచి రాకపోకలు సాగించడం లేదు.  






Updated Date - 2022-09-13T05:18:08+05:30 IST