Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరద బాధితులను ఆదుకోవాలి

మాజీమంత్రి కామినేని శ్రీనివాస్‌

కైకలూరు, నవంబరు 26 : వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీమంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ అన్నారు. వరహాపట్నంలో శుక్రవారం వరదబాధితుల సహాయార్థం  బీజేపీ ఆధ్వర్యంలో విరాళాలను సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుని అండగా ఉండాలన్నారు. అనంతరం కైకలూరులో  విరాళాలను సేకరించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కట్టా వీరరాఘవులు, వేంపాటి విష్ణూరావు, పామర్తి రాంబాబు, కీర్తి వెంకటరామ్‌ప్రసాద్‌, వేంపాటి గోవింద్‌, గరికిపాటి రాంబాబు, బుర్ల బాలకృష్ణ, జి.దేవి పాల్గొన్నారు.


Advertisement
Advertisement