వరద బాధితులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2021-11-27T06:32:03+05:30 IST

వరదల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

వరద బాధితులను ఆదుకోవాలి
కంది పంటను పరిశీలిస్తున్న రామక్రిష్ణ

  1. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ 


డోన్‌/ప్యాపిలి, నవంబరు 26: వరదల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శుక్రవారం డోన్‌ మండలం ఓబులాపురం, ప్యాపిలి మండలం వెంగళాంపల్లి ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ వరదల వల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందన్నారు. అతివృష్టి, అనావృష్టితో నష్టపోయిన పత్తి, కంది, ఆముదం తదితర పంటలు సాగు చేసిన రైతులకు ఎకరాకు రూ.25వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సర్పంచులకు వచ్చిన 14, 15 ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించడం చాలా అన్యాయమన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు, ప్రజల అత్యవసర పనులను సర్పంచులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. త్వరలో సర్పంచుల ను సమీకరించి సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథరెడ్డి, కె.రామాంజినేయులు, డోన్‌ నియోజకవర్గ కార్యదర్శి రంగనాయుడు, రాధాకృష్ణ, సుంకయ్య, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి నక్కి లెనిన్‌బాబు, వెంకటేష్‌, నాగన్న, మోటరాముడు, సర్పంచు రవిమోహన్‌, సుధాకర్‌, నారాయణ పులిశేఖర్‌, ప్రభాకర్‌, అబ్బాస్‌, వరదరాజులు, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-27T06:32:03+05:30 IST