సాగర్‌ ప్రాజెక్టుకు పెరిగిన వరద

ABN , First Publish Date - 2021-10-01T01:58:20+05:30 IST

నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద రాక పెరిగింది. నాలుగు రోజులుగా రెండు క్రస్ట్‌ గేట్లను ఐదు అడుగుల మేరకు

సాగర్‌ ప్రాజెక్టుకు పెరిగిన వరద

నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద రాక పెరిగింది. నాలుగు రోజులుగా రెండు క్రస్ట్‌ గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండగా, బుధవారం నాలుగు గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగించారు. గురువారం వరద రాక మరింత పెరగడంతో మరో రెండు గేట్లను ఎత్తి మొత్తం ఆరు క్రస్ట్‌గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు(312.0450 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 590 అడుగులు(312.0450 టీఎంసీలు)గా ఉంది. సాగర్‌ నుంచి కుడి కాల్వకు 8,221 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం నుంచి 32,399 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీకి 1,200 క్యూసెక్కులు, ఆరు క్రస్టుగేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 48,600 క్యూసెక్కులు మొత్తంగా 90,420 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎడమ కాల్వ, వరద కాల్వకు ఎలాంటి నీటి విడుదల లేదు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.10అడుగులుగా ఉంది. ఎగువనుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 4133 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,680 క్యూసెక్కుల నీటిని సాగర్‌ జలాశయానికి విడుదల చేస్తున్నారు.  

Updated Date - 2021-10-01T01:58:20+05:30 IST