ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద

ABN , First Publish Date - 2020-08-15T22:53:42+05:30 IST

ఎగువ నుంచి భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వస్తోంది. దీంతో 60 గేట్లు అడుగు మేర ఎత్తారు. వరద ప్రవాహాన్ని బట్టి 60 నుండి 70 గేట్లు ఎత్తుతామని అధికారులు చెబుతున్నారు.

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద

విజయవాడ: ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వస్తోంది. దీంతో 60 గేట్లు.. అడుగు మేర ఎత్తారు. వరద ప్రవాహాన్ని బట్టి 60 నుండి 70  గేట్లు ఎత్తుతామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజికి ఇన్ ఫ్లో 77 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 44,000 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. తాగుసాగు నీరు కోసం 11,000 క్యూసెక్కులు ఈస్ట్ కెనాల్, వెస్ట్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు. రెండు రోజుల పాటు వరద ప్రవాహం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాత్రికి 60వేలు క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.ప్రకాశం బ్యారేజీ ఎగువభాగాన ఉన్న మున్నేరు, వైరా, కట్లేరు నుంచి వస్తున్న వరద వస్తోంది.  పాలేరు నది, మున్నేరు పరవళ్లు తొక్కుతున్నాయి. కంచికచెర్ల మండలం కీసర వద్ద  వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. 75 వేల క్యూసెక్కుల వరద నీరు కృష్ణా నదికి చేరింది. ప్రకాశం బ్యారేజీ పరివాహక ఏరియాలో కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజి వద్ద వరద పరవళ్లు తొక్కుతోంది. వరద నీరు మరో మూడు రోజుల ఇదే విధంగా కొనసాగుతుందంటుని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-08-15T22:53:42+05:30 IST