శ్రీశైలానికి 67,233 క్యూసెక్కుల వరద

ABN , First Publish Date - 2021-10-18T02:04:03+05:30 IST

శ్రీశైలానికి 67,233 క్యూసెక్కుల వరద

శ్రీశైలానికి 67,233 క్యూసెక్కుల వరద

శ్రీశైలం: జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి 67,233 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. వరద తగ్గడంతో శనివారం రాత్రి జలాశయం గేట్లను మూసివేశారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రాజెక్టులో ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి 884.80 అడుగుల వద్ద 214.8450 టీఎంసీల నిల్వలు నమోదు అయ్యాయి. విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ 28,252 క్యూసెక్కులు, ఆంధ్రప్రదేశ్‌ 30,771  క్యూసెక్కుల నీటిని వినియోగించుకుని నాగార్జున సాగర్‌ జలాశయానికి విడుదల చేస్తున్నాయి.


Updated Date - 2021-10-18T02:04:03+05:30 IST