శ్రీశైలానికి పెరుగుతున్న వరద

ABN , First Publish Date - 2022-07-17T02:16:58+05:30 IST

శ్రీశైలం జలాశయానికి క్రమక్రమంగా వరద పెరుగుతోంది. సుంకేసుల బ్యారేజీ, జూరాల ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన వరద శ్రీశైలానికి చేరుతోంది.

శ్రీశైలానికి పెరుగుతున్న వరద

శ్రీశైలం: శ్రీశైలం జలాశయానికి క్రమక్రమంగా వరద పెరుగుతోంది. సుంకేసుల బ్యారేజీ, జూరాల ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన వరద శ్రీశైలానికి చేరుతోంది. సాయంత్రం 6 గంటల సమయానికి డ్యాంలో 2,70,386 క్యూసెక్కులు చేరుతుందని లెక్కించారు. సుంకేసుల ప్రాజెక్టు నుంచి తుంగభద్ర వరద 1,35,453 క్యూసెక్కులు, జూరాల ప్రాజెక్టు నుంచి కృష్ణా వరద 1,34,933 క్యూసెక్కులు విడుదల చేశారు. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 855 అడుగులు, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా.. 842.10 అడుగుల వద్ద 65.0461 టీఎంసీలకు చేరింది. గురువారం ఇదే సమయానికి 51.4304 టీఎంసీలు ఉండేది. 24 గంటల్లో 13.6121 టీఎంసీల వరద చేరింది. వరద ఇలాగే కొనసాగితే పది రోజుల్లోగా జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 212 టీఎంసీలకు చేరుతుందని ప్రాజెక్టు ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2022-07-17T02:16:58+05:30 IST