Abn logo
Sep 22 2021 @ 01:39AM

నిజాంసాగర్‌లోకి 7500 క్యూసెక్కుల వరద

ప్రాజెక్టు గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు

రెండు గేట్ల ఎత్తివేత.. 10వేల 500 క్యూసెక్కుల నీటి విడుదల 

నిజాంసాగర్‌, సెప్టెంబరు 21: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు నిజాంసాగర్‌లోకి 7500 క్యూసెక్కు ల వరద నీరు వచ్చి చేరుతుంది. నిజాంసాగర్‌ ప్రాజె క్టు క్యాచ్‌మెంట్‌ ఏరియాల ద్వారా 2500 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో మంగళవారం ప్రాజెక్టు వీఏఆర్‌ నెం.5లోని 3, 6వ గేట్లను ఎత్తి 8వేల క్యూసె క్కుల నీటిని మంజీరా నదిలోకి వదిలి వేస్తున్నారు. ప్రధాన కాల్వ ద్వారా 1200 క్యూసెక్కులు, జెన్‌కో గేట్ల ద్వారా 1300 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నట్లు డిప్యూటీ ఈఈ శ్రావణ్‌ కుమా ర్‌ రెడ్డి తెలిపారు. నిజాంసాగర్‌లో 1405 అడుగుల నీటి సామర్థ్యాన్ని నిల్వ చేస్తూ ఎగువ నుంచి వచ్చే నీటిని మంజీరా నది, మంజీరా ఉప నది, ప్రధాన కాల్వలోకి విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నిజాంసాగర్‌ వరద గేట్లు ఎత్తివేయడంతో మంజీరా పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.