సాగర్‌కు పోటెత్తిన వరద

ABN , First Publish Date - 2021-09-18T00:45:49+05:30 IST

నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు ఎగువనుంచి వరద పెరగటంతో 12 క్రస్టుగేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

సాగర్‌కు పోటెత్తిన వరద

నాగార్జునసాగర్‌: నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు ఎగువనుంచి వరద పెరగటంతో 12 క్రస్టుగేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు ఆరు క్రస్టుగేట్లను 10అడుగుల మేరకు ఎత్తి 1,67,622 క్యూసెక్కులు, కుడి గట్టు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 27,161క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 31,784 క్యూసెక్కులు మొత్తంగా 2,26,567క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. దీంతో ఒక్కరోజులో సాగర్‌ నీటిమట్టం రెండు అడుగులు పెరిగి పూర్తి స్థాయికి చేరుకుంది. సాగర్‌ ప్రాజెక్టు నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకోవడంతో శుక్రవారం ఉదయం 3గంటలకు 10గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు నీటిని విడుదల చేశారు.

Updated Date - 2021-09-18T00:45:49+05:30 IST