మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..మూడు గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2022-07-09T15:01:06+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. అధికారులు మూడు గేట్లు నాలుగు

మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..మూడు గేట్లు ఎత్తివేత

నల్లగొండ: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. అధికారులు మూడు గేట్లు నాలుగు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో: 3,426.64 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో: 1,253.61 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.  ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం: 645 అడుగులు కాగా, ప్రస్తుత సామర్థ్యం : 641.10 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 4.46 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం : 3.47 టీఎంసీలుగా కొనసాగుతుంది.

Updated Date - 2022-07-09T15:01:06+05:30 IST