Abn logo
Aug 4 2021 @ 03:07AM

కృష్ణమ్మకు తగ్గిన వరద ప్రవాహం

కర్నూలు, విజయవాడ, ఆగస్టు 3: కృష్ణానదికి వరద ప్రవాహం తగ్గుతోంది. డ్యాంలోకి ఇన్‌ఫ్లో 2,09,586 క్యూసెక్కులకు తగ్గిందని నీటి పారుదలశాఖ అధికారులు మంగళవారం తెలిపారు. అవుట్‌ఫ్లో 2,09,492క్యూసెక్కులు ఉన్నట్లు చెప్పారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో 2,45,068 క్యూసెక్కులు, అవుట్‌ ఫ్లో 2,11,750 క్యూసెక్కులు ఉంది. బ్యారేజీ 30గేట్లను ఐదడుగులు, మరో 40 గేట్లను నాలుగడుగులు ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.