అడుగడుగునా గండమే..!

ABN , First Publish Date - 2022-08-07T05:23:30+05:30 IST

ఏజెన్సీ అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వాగులు క్షణాల్లోనే ఉధృతంగా ప్రవహిస్తాయి.

అడుగడుగునా గండమే..!
ఉధృతంగా ప్రవహిస్తున్న పట్టెన్నపాలెం జల్లేరు వాగు

వర్షమొస్తే ఏజెన్సీలో వాగుల ఉధృతి 

ఎప్పుడు రోడ్డెక్కుతాయో తెలియదు

రహదారులు  మూసుకుపోతాయ్‌..

ఆ దారిలో ప్రయాణం..భయం..భయం


వర్షాకాలం వస్తే ఆ మార్గంలో వెళ్లాలంటే బిక్కుబిక్కు మంటుంటారు..ఎప్పుడు ఏ వాగు పొంగి మీదకు వస్తుందో తెలియదు. ఏజెన్సీ అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వాగులు క్షణాల్లోనే ఉధృతంగా ప్రవహిస్తాయి. అడుగడు గునా ఎదురయ్యే వాగులు రోడ్లపై నుంచి ఉరకలు వేస్తుంటాయి. వాగు ఉధృతి అంచనా వేయలేక పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కార్లు, ట్రాక్టర్‌లు సైతం కొట్టుకుపోతాయి.. మనుషులు, పశువులు గల్లంతైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

 జంగారెడ్డిగూడెం: ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు జాతీయ రహదారి 516–డి ప్రధానమైనది. దీని ద్వారానే నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రెండు రాష్ట్రాలకు రాకపోకలను సాగి స్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రలోని జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం కొయ్యలగూడెం మీదుగా రాజమండ్రి, కాకినాడ పోర్టు, వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌కు వేల సంఖ్యలో  భారీ వాహనాలు వెళ్తుంటాయి. అలాగే ఈ పట్టణాల నుంచి తిరిగి తెలంగాణకు ఇదే రహదారి గుండా వెళ్లాల్సిందే. అయితే కొయ్యలగూడెం నుంచి జీలుగుమిల్లి వరకు భారీ గోతులతో జాతీయ రహదారి నరకప్రాయంగా మారింది. ఈ నరకం భరించలేక కొయ్యలగూడెం నుంచి కన్నాపురం, బుట్టాయిగూడెం, రెడ్డిగణపవరం, జీలుగుమిల్లి మీదుగా తెలంగాణ రాష్ట్రానికి చేరుకుంటున్నారు. అయితే ఈ రోడ్డులో వెళితే ఎన్నో కాల్వలు దాటాల్సి ఉంటుంది. వర్షాకాలంలో ఈ రూటులో వెళ్లాలంటే సాహసం చేసినట్టే.. ముఖ్యంగా కన్నాపురం పడమటి కాలువ చిన్నపాటి వర్షా నికే ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. ఈ కాలువ దాటే సమ యంలో కొద్దిపాటి తప్పిదం చేసినా కాలువలో గల్లంతవ్వక తప్పదు. అది దాటిన తరువాత పద్మావారిగూడెం సమీపం లోని అల్లికాలువ రోడ్డుపై నుంచి నీరు ప్రవహి స్తుంది. అక్కడ నుంచి బుట్టాయిగూడెం వైపు వస్తే విప్పల పాడు జల్లేరు వాగు ఉధృతంగా ప్రవహిస్టుంటుంది. ఇది చాలా ప్రమాదకరం. ఇది దాటిన తరువాత వీరన్న పాలెం గ్రామ దగ్గర కాల్వ కూడా చిన్న వర్షాలకే ఉదృతంగా ప్రవహి స్తుంటుంది. శనివారం కూడా ఈ కాలువ ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు బంద్‌ అయ్యాయి. అది దాటక గణపవరం కాలువ..అదీ దాటితే జీలుగుమల్లి మండలం కామయ్యపాలెం రోడ్డు పై నుంచి అశ్వారావుపేట వాగు అత్యంత ప్రమాదకరంగా ప్రవహిస్తుంటుంది. అటు జాతీయ రహదారి భారీ గోతుల భయం.. ఇటు ఏజెన్సీ మార్గంలో వస్తే వాగుల సంకటం.. వీటితో పాటు జీలుగుమిల్లి మండలంలోని పి.రాజవరంలోని కోమటి కాలువ, వంకవారి గూడెం వాగు, లంకాలపల్లి వాగులు కూడా ప్రవహించి సమీప గ్రామాలకు రాకపోకలు ఆపే స్తుంటాయి. అలాగే టి.నరసాపురం మండలంలో అప్పల రాజుగూడెం– మధ్యాహ్నపువారిగూడెం గ్రామాల మద్యలో ఎర్రకాలువ,  బండివారిగూడెం–గంగినీడిపాలెం గ్రామాల మధ్యలో ప్రవహించే ముగ్గురాల వాగు, మక్కిన వారి గూడెం– టి.నర సాపురం గ్రామాల మధ్యలోని జల వాగులు ఉధృతంగా ప్రవహించడంతో ఆయా గ్రామాలకు రాక పోకలు నిలిచిపో తుంటాయి. ఇక ఏజెన్సీలో ప్రాంతం నుంచి జంగారెడ్డిగూడెం పట్టణానికి వచ్చేందుకు పట్టెన్నపాలెం జల్లేరు వాగు అత్యంత ప్రమాదకరమైంది. ఈ కాలువలో గతంలో పదుల సంఖ్యలో మనుషులు ప్రమాదాలకు గురయ్యారు. వాహనాలు, పశువులు ఎన్నో కొట్టుకుపోయాయి. 


Updated Date - 2022-08-07T05:23:30+05:30 IST