కిరాణా, స్థానిక ఎమ్‌ఎస్‌ఎమ్ఈల కోసం ఫ్లిప్‌కార్ట్ హోల్‌‌సేల్ డిజిటల్ ప్లాట్‌ఫాం!

ABN , First Publish Date - 2020-09-02T22:07:19+05:30 IST

ప్రముఖ డిజిటల్ మార్కెట్‌ప్లేస్ ఫ్లిప్‌కార్ట్.. కిరాణా, స్థానిక ఎమ్‌ఎస్ఎమ్ఈల కోసం కొత్తగా ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ డిజిటల్ ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తెచ్చింది.

కిరాణా, స్థానిక ఎమ్‌ఎస్‌ఎమ్ఈల కోసం ఫ్లిప్‌కార్ట్ హోల్‌‌సేల్ డిజిటల్ ప్లాట్‌ఫాం!

న్యూఢిల్లీ: ప్రముఖ డిజిటల్ మార్కెట్‌ప్లేస్ ఫ్లిప్‌కార్ట్.. కిరాణా, స్థానిక ఎమ్‌ఎస్ఎమ్ఈల కోసం కొత్తగా ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ డిజిటల్ ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా కిరాణా వ్యాపారులు, రీసెల్లర్లు, ఎమ్ఎస్ఎమ్ఈలకు సులభతరమైన క్రెడిట్ సౌకర్యం కలుగుతుందని, అలాగే విస్తృతశ్రేణి క్వాలిటీ ఉత్పత్తులు కూడా వీరికి అందుబాటులోకి వస్తాయని ఫ్లిప్‌కార్ట్ చెప్తోంది. ఈ బీ2బీ(బిజినెస్ టూ బిజినెస్) ప్లాట్‌ఫాంలో ఆర్డర్ ట్రాకింగ్ సదుపాయం కూడా ఉన్నట్లు తెలిపింది. ఈ ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ అనేది రిటైల్ వ్యాపారస్థుకు వన్ స్టాప్ సొల్యూషన్ అని సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. 


ప్రస్తుతానికి గురుగ్రామ్, ఢిల్లీ, బెంగళూరు సిటీల్లో మాత్రమే ఈ ప్లాట్‌ఫాం అందుబాటులో ఉంది. త్వరలోనే దీన్ని ముంబైకి కూడా విస్తరిస్తామని ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధులు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి కనీసం మరో 20 పట్టణాలకు ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్‌ను విస్తరించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. దీనిపై ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ ఆదర్శ్ మీనన్ స్పందించారు. ‘భారతీయ కిరాణాలు, ఎమ్ఎస్ఎమ్ఈల శ్రేయస్సే లక్ష్యంగా ఈ ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్‌ను రూపొందించాం. టెక్నాలజీని ఉపయోగించి చిన్న వ్యాపారాన్ని సులభతనం చేయడమే మా లక్ష్యం. ఈ చిన్న వ్యాపారాలకు విస్తృత శ్రేణిలో ఉత్పత్తులను, సరసమైన ధరల్లో అందుబాటులో ఉంచుతాం. తద్వారా ఈ వ్యాపారుల అవసరాలను అందుకుంటాం’ అని మీనన్ పేర్కొన్నారు.

Updated Date - 2020-09-02T22:07:19+05:30 IST