ఫ్లిక్‌కార్ట్‌లో 70 వేల ఉద్యోగాలు!

ABN , First Publish Date - 2020-09-15T21:10:30+05:30 IST

ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ భారీ సంఖ్యలో ఉద్యోగులను తీసుకోవాలని యోచిస్తోంది. తన సప్లయి చైన్‌లో ఏకంగా 70 వేల మందికి

ఫ్లిక్‌కార్ట్‌లో 70 వేల ఉద్యోగాలు!

బెంగళూరు: ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ భారీ సంఖ్యలో ఉద్యోగులను తీసుకోవాలని యోచిస్తోంది. తన సప్లయి చైన్‌లో ఏకంగా 70 వేల మందికి ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. పండుగ సీజన్‌తోపాటు వచ్చే నెలలో ఫ్లాగ్‌షిప్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో డిమాండ్‌ను తట్టుకోవడానికి పెద్ద ఎత్తున నియామకాలు చేప్టట్టనుంది. ఫలితంగా విక్రయదారులు, ఎకో సిస్టం భాగస్వాముల స్థానాల్లో పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగ కల్పన జరగనున్నట్టు పేర్కొంది.


ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఈకార్ట్ అండ్ మార్కెట్ ప్లేస్ ఉపాధ్యక్షుడు అమితేష్ ఝా మాట్లాడుతూ.. బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా అదనపు అవకాశాలు ఇస్తూనే వినియోగదారులకు గొప్ప అనుభవాన్ని ఇచ్చేందుకు ప్రభావంతమైన భాగస్వామ్యాలు సృష్టించడంపై దృష్టి సారించినట్టు చెప్పారు. ఉపాధి కల్పన ద్వారా, తమ విక్రయదారుల వ్యాపారాన్ని పెంచడం ద్వారా, వ్యాపార, ఆర్థిక వృద్ధిలో వృద్ధిని పెంచేందుకు తమ వంతు కృషి చేయనున్నట్టు తెలిపారు. 


సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ తాను నియమించుకునే వారికి శిక్షణ కూడా ఇవ్వనుంది. ఇందులో సర్వీస్, డెలివరీ, ఇన్‌స్టాలేషన్, సేఫ్టీ, శానిటైజేషన్ చర్యలు, పీఓఎస్ మెషీన్లు, స్కానర్లు, వివిధ రకాల మొబైల్ అప్లికేషన్లు, ఈఆర్‌పీ వంటివి ఉన్నాయి. కరోనా కారణంగా మందగించిన ఆన్‌లైన్ అమ్మకాలు ఇటీవల కొంత పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో టాప్ ఈకామర్స్ కంపెలు ఫెస్టివ్ సేల్‌కు సిద్ధమవుతున్నాయి. 

Updated Date - 2020-09-15T21:10:30+05:30 IST