ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్.. ఆకర్షణీయ ఆఫర్లు!

ABN , First Publish Date - 2020-09-16T00:20:10+05:30 IST

మరో ఆకర్షణీయ సేల్‌తో ఫ్లిప్‌కార్ట్ వినియోగదారుల ముందుకు వచ్చేస్తోంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ పేరుతో ఈ నెల 18 నుంచి 20 వరకు

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్.. ఆకర్షణీయ ఆఫర్లు!

న్యూఢిల్లీ: మరో ఆకర్షణీయ సేల్‌తో ఫ్లిప్‌కార్ట్ వినియోగదారుల ముందుకు వచ్చేస్తోంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ పేరుతో ఈ నెల 18 నుంచి 20 వరకు నిర్వహించనుంది. మొబైల్స్‌పై ఆకట్టుకునే ఆఫర్లు ప్రకటించింది. ‘ఎల్‌జీ జి8ఎక్స్’పై ఏకంగా రూ. 15 వేల రాయితీ ప్రకటించింది. ‘ఒప్పో రెనో 2ఎఫ్’పై వెయ్యి రూపాయలు, ‘రెడ్‌మి కె20’ని ఎక్స్‌చేంజ్‌లో ఎక్స్‌చేంజ్‌లో కొనుగోలు చేసుకోవాలనుకునే వారికి అదనంగా రూ. 2వేల రాయితీ లభిస్తుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్, ఈఎంపై లావాదేవీలపై ఫ్లిప్‌కార్ట్ 10 శాతం తక్షణ రాయితీ ఇస్తోంది. 


ఎల్‌జి జి8ఎక్స్ 6జీబీ+128 జీబీ మోడల్ ధర ప్రస్తుతం రూ. 54,990 కాగా, ప్రీపెయిడ్ యూజర్లకు ఎల్‌జీ రూ. 15 వేల రాయితీ ఆఫర్ చేస్తోంది. దీంతో 39,990కే దీనిని సొంతం చేసుకోవచ్చు. ఎక్స్‌చేంజ్ చేసుకునే ప్రీపెయిడ్ యూజర్లకు రియల్‌మి ఎక్స్50 ప్రొ 5జీపై ఫ్లిప్‌కార్ట్ రూ. 3 వేల రాయితీ ప్రకటించింది. ఒప్పో రెనో 2ఎఫ్‌ను రూ. 17,990కే లిస్ట్ చేసింది. ఒప్పో ఎ92020పై రూ. 2 వేలు తగ్గించి రూ. 13,990కే అందుబాటులో ఉంచింది. రెడ్‌మి కె20పై అదనంగా 2 వేలు రాయితీ ప్రకటించింది. అయితే, ఇది ఎక్స్‌చేంజ్ వినియోగదారులకు మాత్రమే. 


ఐక్యూ3 128జీబీ బేస్ మోడల్‌ను ప్రీపెయిడ్ వినియోగదారులకు రూ.31,990కే అందిస్తోంది. అలాగే, ఈ నెల 20న మధ్యాహ్నం 12 గంటలకు ఇటీవల విడుదలైన టెక్నో స్పార్క్ పవర్ 2 ఎయిర్ స్మార్ట్‌ఫోన్‌ సేల్ ప్రారంభం కానుంది. వీటితోపాటు మరెన్నో మొబైల్స్‌పై ఫ్లిప్‌కార్ట్ డీల్స్ ప్రకటించింది. 


Updated Date - 2020-09-16T00:20:10+05:30 IST