Advertisement
Advertisement
Abn logo
Advertisement

బిగ్ బిలియన్ డేస్‌కు ఫ్లిప్‌కార్ట్ రెడీ.. బ్యాంక్ ఆఫర్లు, డీల్స్ ఇవే!

న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సేల్ వచ్చేస్తోంది. ఇందుకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసిన ఆన్‌లైన్ రిటైలర్.. తేదీలను మాత్రం వెల్లడించలేదు. అయితే, బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా అందుబాటులో ఉండే కొన్ని ఉత్పత్తులను మాత్రం చూపించింది. బహుశా ఈ సేల్ అక్టోబరు తొలి వారంలో ఉండొచ్చని తెలుస్తోంది. 


ఫ్లిప్‌కార్ట్ తాజా సేల్‌లో భాగంగా యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. అంటే వినియోగదారులకు తక్షణ రాయితీలు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉంటాయన్నమాటే. అలాగే, బిగ్‌ బిలియన్ డేస్ సేల్‌లో జరిపే పేటీఎం వాలెట్, యూపీఐ ద్వారా జరిగే చెల్లింపులపైనా క్యాష్‌బ్యాక్ లభిస్తుందని ఫ్లిప్‌కార్ట్ స్పష్టం చేసింది.


సేల్ సందర్భంగా అందుబాటులోకి రానున్న వాటిలో రియల్‌మి 4కె గూగుల్ టీవీ స్టిక్, స్టూడెంట్స్ కోసం లెనోవో, నోకియా స్మార్ట్ టీవీ (ఆండ్రాయిడ్ 11), ఏసర్ ప్రిడేటర్ గేమింగ్ ల్యాప్‌టాప్, బౌల్ట్ టీడబ్ల్యూఎస్, ఫైర్ బోల్ట్ నుంచి స్మార్ట్‌వాచెస్, హిసెన్సె నుంచి టీవీలు తదితర ఉత్పత్తులు ఉన్నాయి. అలాగే, సౌండ్ బార్స్, వైర్‌లెస్ హెడ్‌సెట్స్, ల్యాప్‌టాప్స్, స్మార్ట్‌వాచ్‌లపై డీల్స్, డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తోంది. యాపిల్, ఒప్పొ, వివో ప్రొడక్ట్స్‌పైనా డీల్స్ ప్రకటించింది. 

Advertisement
Advertisement