Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్‌ సేల్‌లో ఇలా కొంటే బోల్డంత లాభం!

ABN , First Publish Date - 2022-09-15T23:01:55+05:30 IST

ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సేల్‌ ( Flipkart Big Billion Days Sale)కు సిద్ధమవుతున్నారా? అయితే, ఒక్క నిమిషం.

Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్‌ సేల్‌లో ఇలా కొంటే బోల్డంత లాభం!

న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సేల్‌ ( Flipkart Big Billion Days Sale)కు సిద్ధమవుతున్నారా? అయితే, ఒక్క నిమిషం. ఈ విషయం తెలిస్తే మీరు కొనుగోలు చేయాలనున్న గాడ్జెట్‌ను మరింత తక్కువకే ధరకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈ నెల 23న ప్రారంభం అవుతుంది. 8 రోజులపాటు కొనసాగే ఈ సేల్ ఈ నెల 30న ముగుస్తుంది. ల్యాప్‌టాప్, మొబైల్స్, స్మార్ట్‌వాచ్‌లు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌పై బ్రహ్మాండమైన డిస్కౌంట్లు ప్రకటించింది. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి ఖరీదైన ఎంపిక చేసిన ఉత్పత్తులపై ‘ఓపెన్ బాక్స్ డెలివరీ’ (Open Box Delivery) కూడా నిర్వహిస్తోంది. మరో ఈకామర్స్ సంస్థ అమెజాన్ (amazon) కూడా అదే రోజున గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 (Great Indian Festival 2022) సేల్ నిర్వహిస్తోంది. 


ఇలా అతి తక్కువలో పొందొచ్చు

ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ వస్తూవస్తూ బోల్డన్ని ఆఫర్లు తీసుకురావడమే కాదు అంతకుమించిన రాయితీలు కూడా ప్రకటించింది. రాయితీలు, క్యాష్‌బ్యాక్, పే లేటర్ వంటివి ఆఫర్ చేస్తోంది. వీటితోపాటు డెబిట్, క్రెడిట్ కార్డులు, ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై 10 శాతం తక్షణ రాయితీ లభిస్తుంది. అలాగే, పేటీఎం కూడా ఓ ఆఫర్ ప్రకటించింది. పేటీఎం, యూపీఐ, వాలెట్ లావాదేవీలపై 10 శాతం సేవింగ్స్ హామీ ఇచ్చింది. వినియోగదారులు లక్ష రూపాయల వరకు పే లేటర్ (Pay Later) ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. దీనిని తర్వాతి నెలలో కానీ, ఈజీ ఈఎంఐల రూపంలో కానీ చెల్లించుకోవచ్చు. 


ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం రాయితీ

ప్రింటర్లు, మానిటర్లు, టీవీలు వంటి ఎలక్ట్రానిక్ డివైజ్‌లపై ప్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్‌లో 80 శాతం రాయితీ పొందొచ్చు. అలాగే, క్రేజీ డీల్స్, ఎర్లీ బర్డ్ స్పెషల్, రష్ అవర్స్, టిక్ టాక్ డీల్స్ వంటివి కూడా ప్రకటించింది. ప్రతి అర్ధరాత్రి 12 గంటలు, సాయంత్రం 4 గంటలకు క్రేజీడీల్స్ ఉంటాయి. ‘ఎర్లీబర్డ్ స్పెషల్’ ఐటెమ్స్‌పై రష్ అవర్స్ సేల్‌లో రాయితీలు పొందొచ్చు. ‘టిక్‌ టాక్ డీల్స్’లో ప్రతి గంటకు అతి తక్కువ ధరల్లో సరికొత్త డీల్ ఉంటుంది. 


స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు 

ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సేల్‌లో ‘నథింగ్ ఫోన్ 1’, ‘గూగుల్ పిక్సెల్ 6ఎ’ ఫోన్లను రాయితీలపై కొనుగోలు చేసుకోవచ్చు. నథింగ్ ఫోన్ 1ను రూ. 28,999కి, గూగుల్ పిక్సెల్ 6ఎను రూ. 27,699కే సొంతం చేసుకోవచ్చు. డీల్స్, రాయితీలతోపాటు సరికొత్తగా ఖరీదైన ఫోన్లు వంటి వాటిపై ‘ఓపెన్ బాక్స్ డెలివరీ’ని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఇందులో భాగంగా వస్తువును డెలివరీ చేసే సమయంలో వినియోగదారుడి వద్ద బాక్స్‌ను ఓపెన్ చేసి చూపిస్తారు. అందులోని వస్తువులో ఏమైనా డ్యామేజీ ఉన్నా, తేడాలున్నా అక్కడే దానిని వెనక్కి పంపేయవచ్చు. కాగా, ఓపెన్ బాక్స్ డెలివరీ ప్రస్తుతం కొన్ని బ్రాండ్లు, కొన్ని పిన్‌కోడ్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది.  

Updated Date - 2022-09-15T23:01:55+05:30 IST