ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ నుంచి ఆఫర్ల జడివాన!

ABN , First Publish Date - 2020-09-28T21:29:39+05:30 IST

రెండు ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ భారీ సేల్స్‌కు సిద్ధమయ్యాయి. పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ నుంచి ఆఫర్ల జడివాన!

న్యూఢిల్లీ: రెండు ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ భారీ సేల్స్‌కు సిద్ధమయ్యాయి. పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్‌తో ముందుకు రానుండగా, అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’తో వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఈ రెండు సంస్థలు టీజ్ చేశాయి. ఎస్‌బీఐతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఫ్లిప్‌కార్ట్ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ రాయితీ ప్రకటించింది.


అలాగే, పేటీఎం భాగస్వామ్యంతో క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఇవ్వనున్నట్టు తెలిపింది. మొబైల్స్‌పై ధరల తగ్గింపుతో పాటు పలు డీల్స్ కూడా ఉన్నట్టు పేర్కొంది. దీంతోపాటు ఒక్క రూపాయికే మొబైల్ ప్రొటెక్షన్‌ను ఆఫర్ చేస్తోంది. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తదితర ప్రముఖ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్న ఫ్లిప్‌కార్ట్ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నట్టు వివరించింది. బజాజ్ ఫిన్‌సెర్వ్ కార్డ్ కలిగిన వారికి కూడా నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉన్నట్టు తెలిపింది. 


బిగ్ బిలియన్ డేస్‌ సేల్‌లో భాగంగా టీవీలు, ఇతర లార్జ్ అప్లయెన్సెస్‌పై 80 వరకు తగ్గింపుతోపాటు అప్లయెన్స్‌కు పూర్తిస్థాయి ప్రొటెక్షన్, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు, నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉన్నట్టు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. అలాగే, ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీలపైనా 80 శాతం రాయితీ ప్రకటించింది. ఈ కేటగిరీలో మొత్తం మూడు కోట్ల ఉత్పత్తులను లిస్ట్ చేయగా, 2 లక్షలకు పైగా ప్రైవేటు బ్రాండ్‌లను లిస్ట్ చేసింది. వీటిపైనా 80 శాతం రాయితీ ఇవ్వనుంది.


అమెజాన్ విషయానికొస్తే.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న అమెజాన్ ఆ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి 10 శాతం తక్షణ రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ కార్డులతో ఈఎంఐ లావాదేవీలు జరిపే వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. అయితే, ఎప్పటిలానే తొలుత ప్రైమ్ మెంబర్స్ కోసం సేల్ అందుబాటులోకి రానుంది. 


గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా మొబైల్స్, యాక్సెసరీలపై కనీవినీ ఎరుగని ధరలను లిస్ట్ చేస్తున్నట్టు టీజ్ చేసింది. ఇందులో నోకాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌చేంజ్ రాయితీ, టోటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ వంటివి ఉన్నాయి. అలాగే, ఎక్స్‌‌చేంజ్‌పైనా భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. స్పెషల్ లాంచెస్ కేటగిరీలో ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీలపై 70 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. 


టీవీలు ఇతర లార్జ్ అప్లయెన్సెస్ కేటగిరీలో వారెంట్ పొడిగింపు, నోకాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు ఉన్నాయి. పాత వస్తువుల ఎక్స్‌చేంజ్‌పై రూ. 13,500 వరకు తగ్గింపు, బజాజ్ ఫిన్‌సెర్వ్ క్రెడిట్, డెబిట్ కార్డులపై నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ చేస్తోంది. బజాజ్ ఫిన్‌సెర్వ్ లక్ష రూపాయల వరకు రుణ పరిమితి ఇస్తోంది. అమెజాన్ ఎకో స్మార్ట్ స్పీకర్ రేంజ్, ఫైర్ టీవీ స్టిక్, కిండెల్ రేంజ్‌లపై ధర తగ్గింపు లభించనుంది.


పలు ఉత్పత్తులపై కాంబో ఆఫర్లు కూడా ఉండనున్నాయి. హోం, కిచెన్ ఉత్పత్తులపై 60 శాతం, దుస్తులు, యాక్సెసరీలపై 70 శాతం, ఫుడ్, గౌర్మెట్ కేటగిరీలో 50 శాతం వరకు ధర తగ్గింపు ఇవ్వనున్నట్టు అమెజాన్ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు త్వరలోనే సేల్ తేదీలను ప్రకటించనున్నాయి.   


Updated Date - 2020-09-28T21:29:39+05:30 IST