ఈ నెల 20 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌ సేవింగ్‌ డేస్’‌..

ABN , First Publish Date - 2021-01-18T22:43:40+05:30 IST

ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’... ఈ నెల 20 నుంచి ‘బిగ్ సేవింగ్ డేస్’ నిర్వహించబోతోంది. ఈ నెల 24 తో ఈ సేల్ ముగుస్తుంది.

ఈ నెల 20 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌ సేవింగ్‌ డేస్’‌..

బెంగళూరు :  ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’... ఈ నెల 20 నుంచి ‘బిగ్ సేవింగ్ డేస్’  నిర్వహించబోతోంది. ఈ నెల 24 తో ఈ సేల్ ముగుస్తుంది. ఈ సేల్ లో భాగంగా... హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులకు పది శాతం తగ్గింపు లభించనుంది. కాగా... ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్ల మీద భారీ ఆఫర్లను అందించనున్నట్లు ప్రకటించింది. శామ్‌సంగ్ ఎఫ్ 41, ఐ ఫోన్ ఎక్స్‌ఆర్, మోటో జీ 5జీతో పాటు ఇతర స్మార్ట్‌ఫోన్‌ల మీద ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్‌లో రాయితీ లభించనుంది. 


ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ 11ను సుమారు 48,999 రూపాయలకు పొందవచ్చు. ఇక... మోటరోలా మోటో జి 5జీ రూ.18,999 కే లభిస్తుంది. ల్యాప్‌టాప్‌లు, పీసీ, హెడ్‌ఫోన్‌లు వంటి ఇతర ఎలక్ట్రానిక్స్  ఉపకరణాల మీద 80 శాతం వరకు రాయితీ లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ లో స్మార్ట్ టీవీలు వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి ఉపకరణాలపై 75 శాతం వరకు రాయితీ లభిస్తుంది. ఇక... ఫ్యాషన్‌ యాక్సెసరీలపై 50-80 శాతం వరకు రాయితీ ఇవ్వనుంది. వీటికి అదనంగా... ప్రత్యేక ఉత్పత్తులను చాలా తక్కువ ధరల్లోనే అందించనున్నట్లు  ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. 


Updated Date - 2021-01-18T22:43:40+05:30 IST