భార‌త్, యూఏఈ మ‌ధ్య న‌డ‌వ‌నున్న‌ విమాన స‌ర్వీసులివే

ABN , First Publish Date - 2020-07-12T17:28:40+05:30 IST

క‌రోనా లాక్‌డౌన్ వ‌ల్ల భార‌త్‌లో చిక్కుకున్న యూఏఈ నివాసితులు, ఎన్నారైల‌ను తిరిగి యూఏఈ తీసుకెళ్లేందుకు ఇవాళ్టి (జూలై 12) నుంచి ప్ర‌త్యేక విమానాలు న‌డ‌వ‌నున్నాయి.

భార‌త్, యూఏఈ మ‌ధ్య న‌డ‌వ‌నున్న‌ విమాన స‌ర్వీసులివే

దుబాయి/న్యూఢిల్లీ: క‌రోనా లాక్‌డౌన్ వ‌ల్ల భార‌త్‌లో చిక్కుకున్న యూఏఈ నివాసితులు, ఎన్నారైల‌ను తిరిగి యూఏఈ తీసుకెళ్లేందుకు ఇవాళ్టి (జూలై 12) నుంచి ప్ర‌త్యేక విమానాలు న‌డ‌వ‌నున్నాయి. అలాగే యూఏఈలో చిక్కుకున్న భార‌త ప్ర‌వాసుల‌ను స్వ‌దేశానికి త‌ర‌లించేందుకు ఎతిహాద్‌, ఎయిర్ అరేబియా, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్... అబుధాబి, దుబాయి, షార్జా నుంచి భార‌తదేశంలోని వివిధ న‌గ‌రాల‌కు విమాన స‌ర్వీసులు న‌డ‌ప‌నున్నాయి. ఇరు దేశాల పౌర విమానయాన శాఖ‌ల మధ్య కుదిరిన‌ ఒప్పందంలో భాగంగా ఈ విమాన స‌ర్వీసులు ఈ నెల 26 వ‌ర‌కు న‌డ‌వ‌నున్నాయి. కాగా, యూఏఈలో చిక్కుకున్న భారతీయ పౌరులను మాత్రమే భారతదేశానికి వెళ్లడానికి అనుమతిస్తామని విమానయాన సంస్థలు తెలిపాయి.


ఇక భార‌త్ నుంచి యూఏఈ వెళ్లే విమానాల్లో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ అఫైర్స్ (దుబాయ్ వీసా హోల్డర్స్), ఫెడరల్ అథారిటీ ఆఫ్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్ (ఇతర ఎమిరేట్ల నుండి జారీ చేసిన వీసాలు కలిగి ఉన్నవారు) వారికి యూఏఈ ప్ర‌వేశంలో తొలి ప్రాదాన్యం ఇస్తామ‌ని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ విమానాల్లో ప్ర‌యాణించే ప్ర‌యాణికులు త‌ప్ప‌నిస‌రిగా కోవిడ్‌-19 నెగెటివ్ స‌ర్టిఫికేట్( విమానం బ‌య‌ల్దేర‌డానికి 96 గంట‌ల ముందు నిర్వ‌హించిన‌ పీసీఆర్ టెస్టు) చూపించాల్సిందే. అలాగే ప్ర‌యాణికులు చూపించాల్సిన ఇత‌ర పత్రాలు... 1) చెల్లుబాటు అయ్యే ఐసీఏ / జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు విదేశీ వ్యవహారాల అనుమతి ఉండాలి. 2) త‌ప్ప‌కుండా హెల్త్ డిక్ల‌రేష‌న్ ఫార‌మ్ స‌మ‌ర్పించాలి. 3) కోవిడ్‌-19 డీఎక్స్‌బీ మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. 4) క్వారంటైన్‌లో ఉండేందుకు అంగీక‌రిస్తూ ఫార‌మ్ స‌మ‌ర్పించాలి.


భార‌త్, యూఏఈ మ‌ధ్య న‌డ‌వ‌నున్న‌ విమాన స‌ర్వీసుల వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే...

ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌

దుబాయికి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఐదు భారతీయ నగరాలకు ప్రత్యేక రిపాట్రియేష‌న్ విమానాలను నడుపుతుంది.

1. బెంగళూరు: డైలీ రెండుసార్లు

2. ఢిల్లీ: డైలీ రెండుసార్లు

3. కొచ్చి: డైలీ రెండుసార్లు

4. ముంబై: డైలీ మూడుసార్లు

5. తిరువనంతపురం: డైలీ ఒకసారి


ఎతిహాద్ ఎయిర్‌లైన్స్‌

అబుధాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ భార‌త్‌లోని ఆరు న‌గ‌రాల‌కు జూలై 15 నుంచి 26 వ‌ర‌కు విమాన స‌ర్వీసులు న‌డ‌ప‌నుంది. 

1. ముంబై: డైలీ

2. ఢిల్లీ: వారానికి 6 సార్లు

3. చెన్నై: వారానికి 5 సార్లు

4. బెంగళూరు: వారానికి 5 సార్లు

5. కొచ్చి: వారానికి రెండుసార్లు

6. హైదరాబాద్: వారానికి ఒకసారి


ఎయిర్ అరేబియా

షార్జాకు చెందిన ఎయిర్ అరేబియా విమానయాన సంస్థ 10 భారతీయ నగరాలకు ప్రత్యేక విమానాలను నడుపుతుంది.

1. అహ్మదాబాద్

2. బెంగళూరు

3. కోయంబత్తూరు

4. ఢిల్లీ

5. కన్నూర్

6. కొచ్చి

7. కోజికోడ్‌

8. లక్నో

9. ముంబై

10. తిరువంతపురం


ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్

ఈ విమానయాన సంస్థ ఇండియా నుంచి అబుధాబి, దుబాయి, షార్జాకు పలు విమానాలను నడుపుతుంది. శనివారం నాడు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు కింద పేర్కొన్న భార‌త‌ న‌గ‌రాల నుంచి బ‌య‌ల్దేరుతాయి.

1.  కన్నూర్ నుంచి దుబాయి

2. తిరువనంతపురం నుంచి దుబాయి

3. కోజికోడ్ నుంచి షార్జా

4. ఢిల్లీ నుంచి అబుధాబి

5. ఢిల్లీ నుండి షార్జా


స్పైస్‌జెట్‌

ఈ విమానయాన సంస్థ భారతదేశంలోని నాలుగు న‌గ‌రాల‌ నుంచి రాస్ అల్ ఖైమాకు విమానాలను నడుపుతుంది

1. ఢిల్లీ

2. ముంబై

3. కోజికోడ్

4. కొచ్చి

Updated Date - 2020-07-12T17:28:40+05:30 IST