17 నుంచి భారత్‌, లండన్‌ మధ్య విమానాలు

ABN , First Publish Date - 2020-08-08T08:29:27+05:30 IST

దేశంలోని నాలుగు నగరాలు, లండన్‌ మధ్య ఆగస్టు 17వ తేదీ నుంచి విమానాలు నడపనున్నట్టు బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ శుక్రవారం వెల్లడించింది. భారత ప్రభుత్వంతో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం మేరకు ఈ సర్వీసులను నడుపుతున్నట్టు...

17 నుంచి భారత్‌, లండన్‌ మధ్య విమానాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 7: దేశంలోని నాలుగు నగరాలు, లండన్‌ మధ్య ఆగస్టు 17వ తేదీ నుంచి విమానాలు నడపనున్నట్టు బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ శుక్రవారం వెల్లడించింది. భారత ప్రభుత్వంతో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం మేరకు ఈ సర్వీసులను నడుపుతున్నట్టు పేర్కొంది. ఢిల్లీ, ముంబై నుంచి లండన్‌లోని హీత్రూ విమానాశ్రయానికి వారంలో ఐదు విమానాలు నడపనున్నట్టు కం పెనీ తెలిపింది. అలాగే హీత్రూ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌, బెంగళూరుకు వారంలో నాలుగు విమానాలు రానున్నాయని పేర్కొంది. హోం వ్య వహారాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా విమాన సర్వీసు లు ఉంటాయని తెలిపింది. విమానాల్లో కేబిన్‌ క్రూ పీపీఈ కిట్లను ధరిస్తార ని, ప్రయాణికులతో తక్కువ సంబంధం ఉండే విధంగా నూతన ఆహార సే వను అందుబాటులోకి తెస్తున్నట్టు పేర్కొంది.   


Updated Date - 2020-08-08T08:29:27+05:30 IST