Bagdogra అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే పగుళ్లు...21 విమాన సర్వీసుల రద్దు

ABN , First Publish Date - 2022-03-23T18:14:09+05:30 IST

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బాగ్‌డోగ్రా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వే పగుళ్లు ఏర్పడటంతో 21 విమాన సర్వీసులను రద్దు చేశారు...

Bagdogra  అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే పగుళ్లు...21 విమాన సర్వీసుల రద్దు

బాగ్‌డోగ్రా(పశ్చిమబెంగాల్):పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బాగ్‌డోగ్రా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వే పగుళ్లు ఏర్పడటంతో 21 విమాన సర్వీసులను రద్దు చేశారు. దేశంలోని పలు నగరాల నుంచి బాగ్‌డోగ్రాకు విమాన కార్యకలాపాలను నిలిపివేశారు. పశ్చిమ బెంగాల్‌లోని బాగ్‌డోగ్రా అంతర్జాతీయ విమానాశ్రయంలో మార్చి 22వతేదీన రన్‌వేపై పగుళ్లు ఏర్పడడంతో 21 విమానాలు రద్దు చేశారు. ‘‘ బాగ్‌డోగ్రా రన్‌వేపై పగుళ్లు ఏర్పడ్డాయని ఉదయం 11.50 గంటలకు మా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుంచి నాకు కాల్ వచ్చింది. ఉదయం ఏడు విమానాలు ల్యాండ్ అయ్యాయి. మరో ఐదు టేకాఫ్ అయ్యాయి. రన్‌వే సమస్య కారణంగా 21 విమానాలను రద్దు చేశామని బాగ్‌డోగ్రా ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ పి సుబ్రమణి తెలిపారు.


రన్‌వే చివరి లేయర్‌లో రీసర్‌ఫేసింగ్ పనుల కారణంగా బాగ్‌డోగ్రా అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలను నిలిపివేసినట్లు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది.రన్‌వే దెబ్బతినడంతో విమానాశ్రయంలోని దాదాపు 7,000 మంది ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. ఇప్పటికే బయలుదేరిన ఏడు విమానాలు సమీపంలోని కోల్‌కతా, గౌహతి విమానాశ్రయాలకు మళ్లించారు. మార్చి 22న ఉదయం 11:50 గంటలకు రన్‌వే మూసివేయడం వల్ల విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Updated Date - 2022-03-23T18:14:09+05:30 IST