డ్యాన్స్ చేసిన ఎయిర్ హోస్టస్! ప్రయాణికుల కేరింతలు..! అసలు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-04-06T01:40:34+05:30 IST

కరోనా మన జీవితాల్ని పూర్తిగా మార్చేసింది. మాస్కులు పెట్టుకోవడం తప్పనిసరి అయిపోయింది. మాస్కులు లేకుండా ఎవరైనా కనబడితే మనసుల ఏమోలో చిన్న భయం మొదలవుతుంది. వెంటనే అటువంటి వారికి కాస్తంత దూరంగా జరిగిపోతాం. మరి విమానంలో ఇటువంటి వారు తారసపడితే..?

డ్యాన్స్ చేసిన ఎయిర్ హోస్టస్! ప్రయాణికుల కేరింతలు..! అసలు ఏం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: కరోనా మన జీవితాల్ని పూర్తిగా మార్చేసింది. మాస్కులు పెట్టుకోవడం తప్పనిసరి అయిపోయింది. మాస్కులు లేకుండా ఎవరైనా కనబడితే మనసుల ఏమోలో చిన్న భయం మొదలవుతుంది. వెంటనే అటువంటి వారికి కాస్తంత దూరంగా జరిగిపోతాం. మరి విమానంలో ఇటువంటి వారు తారసపడితే..? మాస్కు పెట్టుకోబోమంటూ మొండికేస్తే..? ఆరోగ్యాలు ప్రమాదంలో పడిపోవు..! ఇటువంటి ఘటన తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విడియోను తొలుత టిక్‌టాక్‌లో ప్రత్యక్షమైంది. బ్రెండన్ ఎడ్లర్ అనే వ్యక్తి దీన్ని షేర్ చేశాడు. వీడియోలో చూపించిన దాని ప్రకారం...మాస్కు పెట్టుకోని జంటను మాస్కు పెట్టుకోవాలంటూ ఎయిర్ హోస్టస్ తేల్చిచెప్పింది. వారి మధ్య సంవాదనం నడుస్తున్న క్రమంలోనే తోటి ప్రయాణికులు ఆ జంటపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విమానం దిగిపోవాలని గట్టిగా చెప్పారు. అక్కడున్న వారందరూ దిగాల్సిందేనని ముక్తకంఠంతో చెప్పడంతో ఆ మొండి జంట చివరికి విమానం దిగక తప్పలేదు. ఎట్టకేలకు వాళ్లు వెళ్ళిపోయినందుకు ఎయిర్ హోస్టెస్ బతుకు జీవుడా అని సంబర పడతూ స్టెప్పులేసింది. తోటి ప్రయాణికులు కూడా చప్పట్లు చరుస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరూ చివరికంటా చూసేయండి!



Updated Date - 2021-04-06T01:40:34+05:30 IST