యూత్‌ను మెప్పించే ఫ్లాష్‌బ్యాక్‌

ప్రభుదేవా, రెజీనా, అనసూయ ప్రధాన పాత్రల్లో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘ఫ్లాష్‌ బ్యాక్‌’. ‘గుర్తుకొస్తున్నాయి’ అనేది ఉపశీర్షిక. డాన్‌ సాండీ దర్శకత్వంలో రమేష్‌ పిళ్లై నిర్మించారు. ఏఎన్‌ బాలాజీ ఈ చిత్రం తెలుగు హక్కులు సొంతం చేసుకున్నారు. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌ని దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ కురసాల విడుదల చేశారు. ‘ఈ చిత్రంలో రెజీనా ఆంగ్లో ఇండియన్‌ టీచర్‌ పాత్రలో కనిపిస్తారు. అనసూయ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రభుదేవా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. సినిమా యువతకు నచ్చుతుంది’ అని దర్శక నిర్మాతలు అన్నారు. శామ్‌ సీఎస్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Advertisement