ఆకాశంలో వింత కాంతి మెరుపు.. వైరలవుతున్న వీడియో !

ABN , First Publish Date - 2020-10-02T17:49:03+05:30 IST

అమెరికాలోని పెన్సిల్వేనియా, ఒహియో ప్రాంతాలలో బుధవారం ఆకాశంలో ఉల్కాపాతాన్ని పోలిన ఓ వింత కాంతి మెరుపు కనిపించి క్షణాల వ్యవధిలో మాయం అయింది.

ఆకాశంలో వింత కాంతి మెరుపు.. వైరలవుతున్న వీడియో !

వాషింగ్టన్: అమెరికాలోని పెన్సిల్వేనియా, ఒహియో ప్రాంతాలలో బుధవారం ఆకాశంలో ఉల్కాపాతాన్ని పోలిన ఓ వింత కాంతి మెరుపు కనిపించి క్షణాల వ్యవధిలో మాయం అయింది. పెన్సిల్వేనియాలో ఒక ట్రక్ డ్రైవర్ ఈ దృశ్యాన్ని తన మొబైల్‌లో చిత్రీకరించాడు. అనంతరం వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయింది. ఆకాశంలో కాంతి మెరుపు కనిపించి వెంటనే అదృశ్యం కావడం వీడియోలో మనం చూడొచ్చు. అయితే, నిపుణులు ఇది ఉల్కాపాతాన్ని పోలిన మెరుపులా అనిపించినా... వేరే వస్తువు వల్ల ఏర్పడిన కాంతి మెరుపు అయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. 

Updated Date - 2020-10-02T17:49:03+05:30 IST