ఆఫ్ఘనిస్థాన్‌లో వెల్లువెత్తిన వరదలు...50 మంది మృతి

ABN , First Publish Date - 2021-05-07T11:41:01+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్ దేశంలో కురిసిన భారీ వర్షాలతో మెరుపు వరదలు వెల్లువెత్తడంతో 50 మంది మరణించారు....

ఆఫ్ఘనిస్థాన్‌లో వెల్లువెత్తిన వరదలు...50 మంది మృతి

కాబుల్ (ఆఫ్ఘనిస్థాన్): ఆఫ్ఘనిస్థాన్ దేశంలో కురిసిన భారీ వర్షాలతో మెరుపు వరదలు వెల్లువెత్తడంతో 50 మంది మరణించారు. ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని 17 ప్రావిన్సులలో భారీవర్షాలు, వరదల వల్ల 50 మంది మరణించారని ఆ దేశ నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికార ప్రతినిధి తమీమ్ అజీమీ చెప్పారు. వరదల్లో మరో 15 మంది గల్లంతయ్యారని, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వరదల వల్ల 2,450 పశువులు మృత్యువాత పడ్డాయి. వరదల వల్ల 460 కుటుంబాలు చిన్నాభిన్నమైనాయి. మృతుల కుటుంబాలకు రూ.50వేలు, క్షతగాత్రులకు రూ.25వేలు ఇస్తామని సర్కారు ప్రకటించింది. ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని బడాఖషన్, మైదాన్ వర్దక్, బమయాన్, బాగ్లాన్, సమంగన్, దయాకుండి, ఖోస్ట్, పరాహ్, పంజ్ షిర్, సరేపుల్, బడ్గీస్, యురుజ్గన్, టాఖర్ ప్రాంతాలు వరదలతో అతలాకుతలమయ్యాయి. 

Updated Date - 2021-05-07T11:41:01+05:30 IST