మా తుఝే సలామ్‌..

ABN , First Publish Date - 2022-08-14T06:17:26+05:30 IST

నగరంలో భారీ జాతీయ జెండాల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. విభిన్న తరహాలో పౌరులు దేశభక్తిని చాటుతున్నారు.

మా తుఝే సలామ్‌..
దుర్గం చెరువు నుంచి గచ్చిబౌలి వరకు నిర్వహిస్తున్న బైక్‌ ర్యాలీ

కవాడిగూడ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): నగరంలో భారీ జాతీయ జెండాల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. విభిన్న తరహాలో పౌరులు దేశభక్తిని చాటుతున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల నేపథ్యంలో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శనివారం జీహెచ్‌ఎంసీ, పోలీసుల సంయుక్తాధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాదిమంది చేతుల్లో మువ్వన్నెల జెండా మురిసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, వజ్రోత్సవ కమిటీ చైర్మన్‌ ఎంపీ కె. కేశవరావు, మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్‌, కాలేరు వెంకటేష్‌, దానం నాగేందర్‌, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, ఎంఎస్‌ ప్రభాకర్‌, యొగ్గె మల్లేష్‌, దయానంద్‌, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకే్‌షకుమార్‌, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ట్యాంక్‌బండ్‌పై నేడు సండే ఫన్‌ డే

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): స్వతంత్ర భారత వజ్రోత్సవాల నేపథ్యంలో ఆదివారం ట్యాంక్‌బండ్‌పై సండే ఫన్‌ డే పునరుద్ధరణ కానుంది. చార్మినార్‌ వద్ద కూడా సండే ఫన్‌ డే తరహాలో ‘ఏక్‌ షామ్‌ చార్మినార్‌ కే నామ్‌’ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌పై ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి వాహనాలను రాకపోకలను బంద్‌ చేయనున్నారు. 

 ఫొటో ఎగ్జిబిషన్‌

బ్రిటీష్‌ వారితో పోరాడి దేశానికి స్వాతంత్య్రం తెచ్చుకున్న విధానం, నాటి పోరాటంలో పాల్గొన్న మహనీయుల చరిత్రను తెలియజేయడంలో భాగంగా ఆదివారం సికింద్రాబాద్‌ స్టేషన్‌లో రైల్వే అధికారులు ప్రత్యేక ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు.పదో నంబర్‌ ఫ్లాట్‌ఫారంపై ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.ల





Updated Date - 2022-08-14T06:17:26+05:30 IST