అంగరంగ వైభవంగా ధ్వజారోహణ

ABN , First Publish Date - 2021-03-04T05:21:44+05:30 IST

మందస వాసుదేవుని ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహణ అంగరంగ వైభవంగా జరిగింది.

అంగరంగ వైభవంగా ధ్వజారోహణ
వాసుదేవుడిని ఊరేగిస్తున్న వేదపండితులు

మందస: మందస వాసుదేవుని ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహణ అంగరంగ వైభవంగా జరిగింది. త్రిదండి దేవనాథ రామానుజ జీయర్‌స్వామి పర్యవేక్షణలో వాసుదేవ పెరుమాళ్‌ స్వామి హనుమత్‌వాహనంలో ఆలయం నుంచి దక్షిణానికి వేంచేశారు. ఈ సందర్భంగా గరుత్మంతుడిని బొమ్మ రూపంలో ధ్వజస్తంభానికి వేలాడదీసి పూజలు చేశారు. సంతానంలేని వారికి గరుడ ప్రసాదం పంపిణీ చేశారు. సూర్యక్రాంతికి ఎదురుగా భూతద్దాన్ని పెట్టి యాగశాలలో అగ్నిప్రతిష్ఠ హోమాలు చేపట్టారు. వాసుదేవుడ్ని ఊరేగింపుగా వేదికపైకి తీసుకువచ్చి రామపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా త్రిదండి వేదనాథ రామానుజ జీయర్‌ స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికభావన పెంపొందించుకోవాలని కోరారు.

Updated Date - 2021-03-04T05:21:44+05:30 IST