ఇంట్లోనే జెండా పండుగ

ABN , First Publish Date - 2020-08-15T05:30:00+05:30 IST

స్కూల్‌ ఉంటే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనేవారు. జాతీయజెండా చేతబూని నినాదాలు చేసేవారు. కరోనా మూలంగా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయితేనేం...

ఇంట్లోనే జెండా పండుగ

స్కూల్‌ ఉంటే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనేవారు. జాతీయజెండా చేతబూని నినాదాలు చేసేవారు. కరోనా మూలంగా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయితేనేం... ఇంట్లోనే ఆనందంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకొందాం. 


  1. ఈరోజు మనం 74వ స్యాతంత్య్ర దినోత్సవం జరుపుకొంటున్నాం. అంటే మనకు స్వాతంత్య్రం సిద్ధించి 73 ఏళ్లు పూర్తయ్యాయి.
  2. బయటకు వెళ్లి ఇండిపెండెన్స్‌ డే వేడుకల్లో పాల్గొనే అవకాశం లేదు కాబట్టి ఇంట్లోనే ఉండి టీవీలో ఎర్రకోటపై ప్రధాని జాతీయజెండా ఎగురవేసే కార్యక్రమాన్ని వీక్షించండి.
  3. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత ఆగస్టు 15న జవహర్‌లాల్‌ నెహ్రూ ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగురవేశారు. అప్పటి నుంచి భారత ప్రధానమంత్రి ఎర్రకోటపై జాతీయజెండా ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోంది.
  4. మన జాతీయ గీతం జనగణమన... ఈ గీతాన్ని రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రాశారు. 
  5. ఆగస్టు15న మనతో పాటు స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొంటున్న దేశాలు మరికొన్ని ఉన్నాయి. దక్షిణ కొరియా, కాంగో, లిచెన్‌స్టీన్‌ 
  6. దేశాలకు ఈ రోజునే స్వాతంత్య్రం లభించింది.
  7. జాతీయ పతాకంలో మూడు రంగులు, మధ్యలో ఆశోకచక్రం ఉంటుంది. పింగళి వెంకయ్య మన జాతీయ జెండా రూపకర్త. 
  8. జాతీయ పతాకాన్ని తయారుచేయడానికి నిర్ధిష్టమైన కొలతలు ఉపయోగించాలి. ఆశోకచక్రంలో 24 పుల్లలు తప్పనిసరిగా ఉండాలి.

Updated Date - 2020-08-15T05:30:00+05:30 IST