ఐఫోన్-మ్యాక్‌బుక్ మధ్య ఎయిర్‌పాడ్స్ ఆటోమెటిక్‌గా కనెక్ట్ కావడం లేదా? అయితే, ఇలా ట్రై చెయ్యండి

ABN , First Publish Date - 2022-02-21T22:41:21+05:30 IST

యాపిల్ ఐఫోన్, మ్యాక్‌బుక్ మధ్య ఎయిర్‌పాడ్స్ ఆటోమెటిక్‌గా కనెక్ట్ కావడం లేదన్నది చాలామంది ఫిర్యాదు.

ఐఫోన్-మ్యాక్‌బుక్ మధ్య ఎయిర్‌పాడ్స్ ఆటోమెటిక్‌గా కనెక్ట్ కావడం లేదా? అయితే, ఇలా ట్రై చెయ్యండి

న్యూఢిల్లీ: ఎయిర్‌పాడ్స్‌ను ఉపయోగించుకోవడం తెలియాలే కానీ, అద్భుతంగా వాడుకోవచ్చు. ముఖ్యంగా మల్టీడివైజ్ కనెక్టివిటీతో ఓ వైపు మ్యాక్‌బుక్‌లో సినిమా చూస్తూనే, ఐఫోన్‌కు వచ్చే కాల్‌ను మిస్ కాకుండా అటెండ్ కావొచ్చు. చాలామందికి ఈ విషయం తెలియక ఇబ్బంది పడుతుంటారు. యాపిల్ గాడ్జెట్స్ మధ్య ఆటోమెటిక్‌గా ఈ సీమ్‌లెస్ కనెక్టివిటీ ఉంటుంది. అయితే, ఇందుకు కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్‌పాడ్స్ స్విచ్ ఫీచర్‌ను ఉపయోగించి ఐఫోన్, మ్యాక్‌బుక్ మధ్య ఎయిర్‌ప్యాడ్స్‌ను ఆటోమెటిక్‌గా కనెక్ట్ చేసుకోవచ్చు. 


ఎయిర్‌పాడ్స్ (సెకండ్ జనరేషన్), ఎయిర్‌పాడ్స్ ప్రొ, ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్, ఎయిర్‌పాడ్స్ (థర్డ్ జనరేషన్)లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఎయిర్‌పాడ్స్‌ను మ్యాక్‌బుక్, ఐఫోన్‌తో ఆటోమెటిక్‌గా కనెక్ట్ చేసుకునేందుకు ఇలా చేయాలి.

* ఎయిర్‌పాడ్స్‌ను తొలుత ఐఫోన్‌ను కనెక్ట్ చేయాలి

* సెట్టింగ్స్‌లోకి వెళ్లి బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి

* ఇక్కడ ఎయిర్‌పాడ్స్‌కు పక్కన ‘ఐ’ అని కానీ ఇన్ఫో ఐకాన్ కానీ ఉంటుంది

* దానిపై క్లిక్‌ చేయడం ద్వారా మోడల్ నంబరు తెలుసుకోవచ్చు. మీది A1523 లేదంటే A1722 మోడల్ అయితే కనుక ఈ ఫీచర్ పనిచేయదు. దానర్థం మీ వద్ద ఉన్నవి ఫస్ట్ జనరేషన్ ఎయిర్‌పాడ్స్ అని.

* మీ మోడల్ కనుక A2031 కానీ, దాని తర్వాతిది కానీ అయితే ఎయిర్‌పాడ్స్ ఆటోమెటిక్‌గా పనిచేస్తాయి.

అయితే, ఇక్కడో విషయాన్ని గుర్తించాలి. అదేంటేంటే.. ఐఓస్ 14, మ్యాక్ఓఎస్ 11 బిగ్ సర్ కానీ, ఆ తర్వాతి వెర్షన్ కానీ ఇన్‌స్టాల్ అయి ఉంటేనే ఈ ఆటోమెటిక్ స్విచ్ ఫీచర్ పనిచేస్తుంది. అలాగే, మరో విషయం కూడా తెలుసుకోవాలి. డివైస్‌లు అన్నీ ఒకే యాపిల్ ఐడీతో సైన్ ఇన్ అయితేనే ఈ ఆటోమెటిక్ స్విచ్ ఆప్షన్ పనిచేస్తుంది. వేర్వేరు ఐడీలతో కనెక్ట్ అయితే మాత్రం ఈ ఫీచర్ పనిచేయదు. 


ఐఫోన్, మ్యాక్‌బుక్ మధ్య ఎయిర్‌పాడ్స్‌ను ఆటోమెటిక్‌గా ఇలా కనెక్ట్ చేసుకోవాలి

* ఎయిర్‌పాడ్స్‌ను తొలుత ఐఫోన్‌కు కనెక్ట్ చేసుకోవాలి

* సెట్టింగ్స్‌లోకి వెళ్లి బ్లూటూత్‌ను ఆన్‌చేసుకోవాలి

* ఎయిర్‌పాడ్స్ పక్కన ‘ఐ’ అని కానీ ఇన్ఫో ఐకాన్‌ కానీ కనిపిస్తుంది

* ఇప్పుడు కనెక్ట్ టు ఐఫోన్‌పై క్లిక్ చేసి ఆపై ఆటోమెటికల్లీని సెలక్ట్ చేయాలి


మ్యాక్‌బుక్‌కు కనెక్ట్ చేసుకోవడానికి ఇలా చేయాలి

* తొలుత మ్యాక్‌కు ఎయిర్‌పాడ్స్ కనెక్ట్ అయ్యాయో, లేదో చూసుకోవాలి

* తర్వాత పైన ఎడమవైపు పక్కనున్న యాపిల్ మెనూను క్లిక్ చేసి సిస్టం ప్రిఫరెన్సెస్‌ను సెలక్ట్ చేసుకోవాలి

* ఇప్పుడు బ్లూటూత్‌ను ఓపెన్ చేసి ఎయిర్‌పాడ్స్ పక్కనున్న ఆప్షన్‌ను క్లిక్ చేయాలి

* డ్రాప్‌డౌన్ మెనూను ఓపెన్ చేసి ఆటోమెటికల్లీని ఎంచుకోవాలి

* ఆ తర్వాత ‘డన్’పై క్లిక్ చేస్తే సరి.. ఐఫోన్‌, మ్యాక్‌బుక్‌తో ఎయిర్‌పాడ్స్ ఆటోమెటిగ్గా అనుసంధానమైపోతాయి. ఇప్పుడు మ్యాక్‌బుక్‌లో సినిమానో, ఇష్టమైన వీడియోనో చూస్తూనే ఫోన్‌ వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందీ లేకుండా మాట్లాడుకోవచ్చు.

Updated Date - 2022-02-21T22:41:21+05:30 IST